Home

»

Tv News

Bigg Boss 10 Telugu: రూల్స్ బ్రేక్ చేసిన నీతూ మాస్టర్.. రోహిత్‌కి బయటి సమాచారం లీక్?

Oct 18, 2026 12:07PM

బిగ్ బాస్ తెలుగు 10 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నీతూ మాస్టర్ పై ఇప్పుడు లీక్ ఆరోపణలు వస్తున్నాయి. హౌస్ లో రోహిత్ తో మాట్లాడుతూ బయట ఏం జరుగుతుందో చెప్పేసిందనే చర్చ జోరుగా సాగుతోంది. మీ ఇంట్లో అందరూ బాగున్నారు, నిన్ను మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు అంటూ పరోక్షంగా ఫ్యామిలీ విషయాలు చెప్పడంతో పాటు, నీ గేమ్ వీక్ అయింది, సోలోగా ఆడు అంటూ బయటి పర్సెప్షన్ కూడా చెప్పేసింది.

బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు బయటి ప్రపంచపు సమాచారాన్ని లోపల చెప్పకూడదు. కానీ నీతూ మాత్రం రోహిత్ కి క్లియర్ గా గైడెన్స్ ఇచ్చినట్టు కనిపించింది. తనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అన్నీ చెప్పకూడదు అంటూనే, ఎమోషన్స్ పక్కన పెట్టి గేమ్ ఆడు అని హింట్ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో  నాగ్ నీతూని కన్ఫెషన్ గదిలోకి పిలిచి రోహిత్‌కి నీతూ సలహాలు ఇచ్చిన వీడియో చూపించి బిగ్‌బాస్ ముందే చెప్పారు కదా బయట విషయాలు చెప్పొద్దని ఎందుకు అంత క్లియర్‌గా చెప్పావ్ అని అడుగుతారు. రోహిత్ వాళ్ల అమ్మ ఫోన్ చేసి ఏడ్చారని నా నెంబరు కనుక్కొని మరీ చెప్పారని నీతూ చెప్తుంది. అందరికీ సలహాలు ఇచ్చావ్ కదా నువ్వు చేసిన తప్పునకు పనిష్మెంట్ ఏంటో చెప్పు అంటే ఇదే నీకు చివరి వార్నింగ్ ఇంకోసారి ఇలా చేస్తే డైరెక్ట్‌గా బయటకి పంపేస్తా అంటారు. ఇక ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటారు.

దీంతో హౌస్ మేట్స్ లో ఫెయిర్ నెస్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైల్డ్ కార్డ్ లు ఇలా బయటి ఇన్ఫర్మేషన్ ఇస్తే గేమ్ మొత్తం మారిపోతుందని కొందరు కంటెస్టెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బిగ్ బాస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక హెచ్చరిక రాలేదు. కానీ నీతూ మాటలు రోహిత్ గేమ్ ని మార్చేసేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
 

 

 

[Neetu Master Leak Bigg Boss 10, Neetu Master Rules Break, Rohith Outside Information, Bigg Boss Telugu 10 Wild Card Leak, Neetu Master Bigg Boss]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com