
బిగ్ బాస్ 10 తెలుగులో ఫిఫ్త్ వీక్ డబుల్ ఎలిమినేషన్ తో పాటు ఐదుగురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ మొత్తం హీటెక్కింది. థర్డ్ వైల్డ్ కార్డ్ గా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకు వస్తూనే డ్యాన్స్ తో పాటు కత్తి సాము నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఫిదా చేసింది. వచ్చిన వైల్డ్ కార్డ్ ఎవరో గెస్ చేయమని నాగ్ హౌస్ మేట్స్ కి చెప్తే ఎవరూ కరెక్ట్ గా గెస్ చేయలేకపోయారు. చరణ్ మంగ్లీ అని చెప్పాడు, దేబ్జానీ కత్తి సాము అంటే డ్యాన్సా అని కామెడీ చేయడంతో నాగ్ తల పట్టుకున్నాడు.
స్టేజ్ మీదకు వచ్చిన నీతూ నేరుగా షాలినీని టార్గెట్ చేసింది. షాలినీ నీ గేమ్ ఏది, నువ్వు అరుస్తున్నావ్, టార్గెట్ షాలినీ అని అరిచి రోహిత్ వెనక దాక్కుంటున్నావ్, నీ గేమ్ కనిపించడం లేదు, రోహిత్ ని అడ్డు పెట్టుకుని ఆడుతున్నావ్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా అని సూటిగా ప్రశ్నించింది. దీనికి షాలినీ వినకుండా గట్టిగా అరుస్తూ మీరు లోపలకు రండి, మీ గేమ్ నేను చూస్తా అని స్టేజ్ మీదే గొడవకు దిగింది. వంశీ గారు మీరు కనిపించడం లేదు, కిచెన్ లోనే ఉంటున్నారు, పాయింట్ లెస్ గా అరుస్తున్నారు అని వంశీని కూడా టార్గెట్ చేసింది. దీనికి వంశీ లోపలకు రండి ఆడుదాం అనడంతో, ఏంటి సార్ వీళ్లు ఇలా ఉన్నారు, బెదిరిస్తున్నారా అంటూ నీతూ, నాగ్ ఇద్దరూ షాక్ అయ్యారు. హౌస్ లోకి వెళ్లకముందే షాలినీ తన తప్పు తెలుసుకోకుండా రోహిత్ తో నీతూ గురించి మాట్లాడటం కూడా కనిపించింది.
ఆ తర్వాత నీతూకు రూ.2 లక్షల బ్రీఫ్ కేస్, రెండు సేఫ్టీ బ్యాడ్జెస్ ఇచ్చి హౌస్ లోకి పంపారు. మ్యాజిక్ పవర్ ఉన్న వారిని ఛాలెంజ్ చేసి గెలిస్తే పవర్ వస్తుందని రూల్ చెప్పారు. హౌస్ లోకి వచ్చిన నీతూ నరేష్, రోహిత్ లకు సేఫ్టీ బ్యాడ్జెస్ పెట్టింది. సంచాలక్ గా నరేష్ ని పెట్టుకుని త్రిగుణ్ తో బాల్ రోలింగ్ టాస్క్ లో పోటీ పడింది. ఈ టాస్క్ లో నీతూ అద్భుతంగా ఆడి గెలిచి త్రిగుణ్ మ్యాజికల్ పవర్ ని లాగేసుకుంది. త్రిగుణ్ పవర్ అవుట్ అయింది. నీతూ వచ్చిన టాస్క్ లోనే గెలిచిందని నాగ్ మెచ్చుకోగా.. షాలినీ ఇంట్లోకి వచ్చాక ఆడుదాం అన్నావ్. నీతూ వచ్చీ రాగానే గెలిచిందిగా అంటూ షాలినీకి నాగార్జున కౌంటర్ వేశాడు. దీంతో షాలిని డల్ అయింది. నీతూ హౌస్ లో షాలినీకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.






