.webp)
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ee ప్రోమో చూస్తే ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఈ షోకి హీరో నరేష్ నటించిన క్రేజీ కళ్యాణం మూవీ టీమ్ నుంచి హీరో, తరుణ్ భాస్కర్ కూడా వచ్చారు. ఇక సుమతో కలిసి ఆయన స్టెప్పులేశారు. సుమ షాకైపోయింది. "ఎవరీ కుర్రాడో... నరేష్ గారు ఎక్కడ " అంటూ కామెడీ చేసింది . "నరేష్ గారి మనవడు అంది." అని చెప్పారు." ఇంతకు క్రేజి కళ్యాణం మూవీలో పెళ్లి ఎవరికీ మీరు ముగ్గురిలో " అని సుమా అడిగింది. దానికి నరేష్ "నేను నిత్య పెళ్ళికొడుకుని అమ్మ " అంటూ కామెడీ చేశారు. ఆ డైలాగ్ తో అందరూ నవ్వేశారు.
"చిన్నప్పుడు ఏడుపులు ఒక్కొక్కరిది ఒక్కో రకం కదా " అని సుమా అడిగేసరికి "చిన్నప్పటి నుంచి నేను ఒక్క సారి కూడా ఏడవలేదు. ఏడ్చానని చెప్తే మీరు ఏడవమంటారు కదా " అన్నాడు తరుణ్ భాస్కర్. దాంతో అందరూ నవ్వేశారు. వెంటనే నరేష్ "మా అమ్మ నోరు ముయ్యడానికి వచ్చినా కొట్టడానికి వచ్చినా దొరికేవాడిని కాదు " ఏడుస్తూ అరుస్తూ వెళ్లిపోయేవాడిని చెప్పి ఎలా వెళ్లిపోయే వారో చేసి మరీ చూపించారు.
వెంటనే సుమ "నరేష్ గారు నీకు సపోర్ట్ చేయడానికి వస్తే బాగుంటుంది అనిపిస్తోంది నువ్వేమంటావ్" అని రీతుని అడిగింది సుమ. "నేను ఇందాకటి నుంచి దేవుడ్ని కోరుకుంటుంది నరేష్ గారి కోసమే " అనేసరికి నరేష్ షాకైపోయి వెళ్లి రీతుతో కలిసి " చినుకులా రాలి " అనే రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. వెంటనే రీతుతో పాటు ఆమె స్టాల్ కి వెళ్లి అక్కడి వంటల్ని చూస్తూండేసరికి ఇమ్మానుయేల్ "సర్ ఇంకా నరేష్ గారు రిలీజ్ కి కూడా రారు " అని చెప్పి కౌంటర్ వేసాడు. తర్వాత ఆమె చేసిన ఒక వంటకం చూసి బాగుంది నాన్న చాలా బాగుంది అన్నారు. వెంటనే సుమ బాగుండడం మాత్రమే కాదు సర్ మీరు టేస్ట్ చేయాలి అనేసరికి షాకైపోయారు.





.webp)
