.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఐదో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్ నరేశ్ చేసిన నామినేషన్ హౌస్ మొత్తాన్ని షేక్ చేసింది. ఈ వారం నామినేషన్స్ లో తన మొదటి టార్గెట్ గా అగ్నిపరీక్ష టీం నుంచి చరణ్ ని ఎంచుకున్నాడు నరేశ్. చరణ్ ని నామినేట్ చేస్తూ నరేశ్ చెప్పిన ప్రతీ మాట హౌస్ లో హీట్ పెంచింది. "రెండు రోజుల్లో మిథిలేష్ 15 లక్షలు తీసుకెళ్లాడు గ్రేట్ అన్నావ్, మరి నువ్వు నాలుగు వారాలుగా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావ్? నువ్వు కామనర్ గా ఈజీగా రాలేదు, ఎంతో మందిని దాటుకుని వచ్చావ్. నీకంటే బెటర్ వాళ్లు వస్తే బాగుండేది. హోస్ట్ సార్ కూడా నీకు ప్రెజెన్స్ లేదన్నారు, బయట ఆడియన్స్ ఓటింగ్ వేయకుండా నిన్ను పంపించారు" అంటూ నరేశ్ సూటిగా చరణ్ గేమ్ ని ప్రశ్నించాడు. కామనర్ కోటా నుంచి అంత కష్టపడి వచ్చి కూడా హౌస్ లో ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదని, నాలుగు వారాలుగా చరణ్ గేమ్ లో యాక్టివ్ గా లేడని నరేశ్ తన పాయింట్ గా చెప్పాడు.
నరేశ్ వేసిన ఈ స్ట్రాంగ్ పాయింట్ కి చరణ్ వెంటనే రివర్స్ అయ్యాడు. "దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అది జనాలు చూసుకుంటారు, అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు" అంటూ చరణ్ నరేశ్ పై ఫైర్ అయ్యాడు. తన గేమ్ గురించి మాట్లాడే హక్కు నరేశ్ కి లేదని, తనను ఎలిమినేట్ చేయాలా వద్దా అనేది బయట ఉన్న జనాలు నిర్ణయిస్తారని చరణ్ తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. అయితే చరణ్ ఇలా అనగానే నరేశ్ మరింత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. "జనాలు లోపలికి వచ్చి ఇలా ఆడు అలా ఆడు అని చెప్పరు కదా, మరి నామినేషన్ ప్రక్రియ ఎందుకు పెట్టారు? నామినేషన్ లో పాయింట్స్ చెప్పాలి కాబట్టే చెప్తున్నా" అంటూ నరేశ్ చరణ్ నోరు మూయించాడు. దీంతో చరణ్ దగ్గర చెప్పడానికి సమాధానం లేక సైలెంట్ అయిపోయాడు.
అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగలేదు, చరణ్ ని నరేశ్ నామినేట్ చేయగానే అగ్నిపరీక్ష టీం మొత్తం ఒక్కటై చరణ్ కి సపోర్ట్ గా వచ్చేసింది. ముఖ్యంగా అమన్ లేచి నరేశ్ పై ఫైర్ అయ్యాడు. "నువ్వు చరణ్ ని అలా అనడం కరెక్ట్ కాదు, నువ్వేం చేస్తున్నావ్? నువ్వు కూడా ఏమీ ఆడటం లేదు కదా, చరణ్ ని టార్గెట్ చేయడం ఆపేయ్" అంటూ అమన్ నరేశ్ ని నిలదీశాడు. అమన్ తో పాటు అపూర్వ, షాలినీ, రోహిత్ కూడా "మీ సెలబ్రిటీ టీం అంతా కలిసి మా అగ్నిపరీక్ష టీం ని టార్గెట్ చేస్తున్నారు, ఇది గ్రూపిజం" అంటూ గొడవకు దిగారు. దీంతో హౌస్ లో సెలబ్రిటీ వర్సెస్ అగ్నిపరీక్ష వార్ మళ్లీ మొదలైంది. కానీ నెటిజన్లు మాత్రం నరేశ్ చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ అని, చరణ్ కి సపోర్ట్ గా వచ్చిన అమన్ గ్రూపిజం చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.




.webp)
.webp)
