.webp)
జయమ్ము నిశ్చయమ్మురా దివాలీ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఇక జగపతి బాబు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. "అసలు నువ్వు ఏ ధైర్యంతో ఎప్పుడూ గెలవని మంగళగిరిలో " అనేసరికి "ఓడిపోయా" అన్నారు లోకేష్. "ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో థర్డ్ హయ్యెస్ట్ మెజారిటీతో మనం గెలుస్తా ఉన్నాం " అన్నారు. "కమిట్మెంట్ ఉండాలి " అని లోకేష్ "కమిట్మెంట్ తో పాటు తెగువ కూడా ఉండాలి " అన్నారు జగపతి బాబు. "అంటే మేనమామ పోలికలేమో మొండోడిని అనండి మూర్కుడిని అనండి . హరి మావయ్య అంతే కదా రోడ్డు మీద ఆపెసుకుని ఎక్కడంటే అక్కడ చంపేసుకుని నిద్రపోయేవాళ్లు. "35 ఇయర్స్ తరువాత మంగళగిరిలో ఆ సీటు గెలవడం పార్టీ నీకు ఇచ్చిన విజయం కాదు పార్టీకి నువ్వు ఇచ్చిన విజయం " అన్నారు జగపతి బాబు.
"2023 సెప్టెంబర్ నాన్నగారి అరెస్ట్ " అనేసరికి "ఇప్పటికీ గుర్తొస్తే చాలా బాధేస్తుంది. ఎవరూ ఊహించలేము. తండ్రిని అలాంటి పరిస్థితిలో చూడాలని ఎవరూ అనుకోరు కదా చాలా బాధేసింది. దేవాన్ష్ ని ఇక్కడికి తీసుకురావొద్దు అన్నారు. ఎవరినైతే బాబు గారిని జైల్లో పెట్టారో వాళ్ళందరూ ఉన్నారు అదే జైల్లో " అని చెప్పారు లోకేష్. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ ఉన్న ఫోటోని ప్లే చేశారు. "ప్రతీ పాలిటిక్స్ కి ఒక ఐకానిక్ ఫోటోగ్రాఫ్ " అన్నారు జగపతి బాబు. "కష్ట కాలంలో ఎవరు నిలబడ్డారు అనేది మనం మర్చిపోకూడదు. ఎప్పుడూ ఒక అన్నగా భావిస్తాను " అన్నారు లోకేష్. మరి లోకేష్ ఈ దీపావళి ఎపిసోడ్ లో ఎలాంటి విషయాలను ఈ జయమ్ము నిశ్చయమ్మురా సెలెబ్రిటీ టాక్ షోలో చెప్పారో చూడాలి.





.webp)
