Home

»

Tv News

Brahmamudi : ఇందుని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య.. రాజుకు దక్కేనా సీఈఓ పీఠం?

Jun 6, 2026 11:42AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1051 లో..... రాజు రెడీ అయ్యాక శేషు తనని కొన్ని ఫోటో స్టిల్స్ తీస్తాడు. మావయ్య ఎలా ఉన్నానని రాజు అడుగుతాడు. నీకేంటి అల్లుడు కింగ్ వి అని శేషు అంటాడు. అప్పుడే ఇందు వచ్చి ఇంకా లేట్ ఏంటని అడుగుతుంది. వస్తున్నా నువ్వు హాల్లో ఉండమని రాజు చెప్తాడు.ఆ తర్వాత ఇందు దగ్గరికి ఐశ్వర్య వచ్చి ఇందు నువ్వు నాతో బయటకి రావాలి. ఆ రాజేష్ గాడు డబ్బు ఇవ్వాలి లేదంటే సోషల్ మీడియాలో డబ్బు ఇవ్వట్లేదని పెడతానంటున్నాడు అని ఐశ్వర్య చెప్తుంది.

ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతానని ఇందు అంటుంది. ఫోన్ ఎందుకు.. త్వరగా వెళ్లి వద్దామని ఐశ్వర్య అంటుంది నాకు ఇప్పుడు మీటింగ్ ఉందని ఇందు అంటుంది. అయిన ఐశ్వర్య వినకుండా రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ఇందు సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత భూషణ్, రేఖ ఆఫీస్ కి వెళ్తుంటే భ్రమరాంబ వాళ్ళకి హారతి ఇస్తుంది. నువ్వే సీఈఓ అవుతావని రేఖతో భ్రమరాంబ అంటుంది. అప్పుడే రాజు వస్తాడు. ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. నాకేం తెలుసు హాల్లో వెయిట్ చెయ్యమని చెప్పానని రాజు అంటాడు. నువ్వే ఇందుని కిడ్నాప్ చేసావని రేఖ అంటుంది. నీకు ఎలా కన్పిస్తున్నా పిన్ని అని ఇందుకి రాజు ఫోన్ చేస్తాడు.

ఇందు, ఐశ్వర్య బయటకి వెళ్తారు. అప్పుడే రాజు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావని అడుగుతాడు. నేను బయటకు వచ్చాను.. మీటింగ్ స్టార్ట్ అయ్యేవరకు వస్తానని ఇందు చెప్తుంది. ఇందు మాటలు రాజు స్పీకర్ లో పెట్టి అందరికి వినిపిస్తాడు. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా  లేదా.. నేను కిడ్నాప్ చేసానని మీరు అంటున్నారు..కానీ నాకు అంత అవసరం లేదు.. నేను ఈ ఇంటికి అల్లుడిని అని రాజు చెప్తాడు. దాంతో రేఖ, భూషణ్ ఆఫీస్ కీ వెళ్తారు. నానమ్మ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను.. సీఈఓగా వస్తానని అపర్ణ వాళ్ళకి రాజు చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. తరువాయి భాగంలో ఇందుని ఐశ్వర్య కిడ్నాప్ చేసిందని అర్థమవుతుంది. నువ్వు సీఈఓ అవ్వడం ఏంటి అందుకే.. కిడ్నాప్ చేసానని ఐశ్వర్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com