Home

»

Tv News

ఈ సొల్లంతా వినడానికి మీకు బుద్ది లేదు... నందిని రెడ్డికి ఇమ్ము కౌంటర్

Oct 31, 2026 6:45PM

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వీక్ షో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అందులోనూ ఈ ఎపిసోడ్ లో జడ్జి , హోస్ట్, పెర్ఫార్మర్స్ అంతా కూడా రకరకాల మూవీ గెటప్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇమ్మానుయేల్ ఐతే పెన్ను, పేపర్, అట్ట  పట్టుకుని భుజానికి ఒక సంచి వేసుకుని వచ్చి కడుపుబ్బా నవ్వించేసాడు. స్టేజి మీదకు వస్తూనే "గుండెల్లో గాయమేదో " అనే సాంగ్ కి హడావిడి చేస్తూ ఆ కవితను ఇతనే రాస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ మరీ వచ్చాడు.

"సో ఇమ్ము నువ్వు " అని సుమ ఆశ్చర్యంతో అడిగేసరికి "నేను ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే గొప్ప   రైటర్ ని అయ్యేవాడిని " అని చెప్పాడు. ఇక రైటర్ అనేసరికి క్రికెట్ ప్లేయర్ గేటుపై లో బ్యాట్ పట్టుకుని వచ్చిన జడ్జ్ నందిని రెడ్డి ఇమ్ము నువ్వు రైటర్ వా అంటూ వెళ్లి హగ్ చేసేసుకున్నారు. ఇక ఇమ్ము ఐతే "మంచి మంచి కవితలు రాసుకొచ్చాను మేడం ఈరోజు మీ కోసం ... ఉట్టి మీద సద్ది లేదు, రోడ్డు మీద రద్దీ లేదు, ఈ సొల్లంతా  వినడానికి మీకు బుద్ది లేదు " అన్నాడు. ఆ కవితకు పక్కనే ఉన్న అంబటి అర్జున్ వాహ్ వ్వా అన్నాడు కానీ సుమ, నందిని ముఖాలు అదో రకంగా పెట్టుకున్నారు. తరువాత ఇంకో కవిత వినిపించాడు.

"పిల్ల గాలి మెల్లగా మెల్లగా వీచి, ఎగిరిపోయింది మా తాత గోచి " అన్నాడు. అంతే వెంటనే నందిని రెడ్డి బ్యాట్ పట్టుకుని "అసలే వంట రాదు సార్ కవిత్వం కూడా రాదారా నీకు " అనేసరికి పక్కనే ఉన్న సుమ "ఇంకొక్క ఛాన్స్ అన్నారు " . "అందని పళ్ళను చూసి మనం వేస్తాము లొట్టలు. కానీ అవే పళ్ళను తిని పిట్టలు వేస్తాయి రెట్టలు " అనేసరికి నందిని రెడ్డి, సుమ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాహ్ వా అనండి మేడం అంటూ ఇమ్మానుయేల్ అడిగేసరికి "వీడిని చంపేయొచ్చా వీడిని చంపేయొచ్చా " అంటూ కామెడీ చేశారు. వెంటనే అంబటి అర్జున్ "ఇన్ని రాసావ్ కదా తలకు కూడా ఏదన్నా రాసుంటే బాగుండేదనిపించింది " అన్నాడు. ఇక ఇమ్ము కూడా కౌంటర్ ఇచ్చాడు. "ఈ కవితలు రాసే క్రమంలోనే తలకు రాయడం మర్చిపోయాను "అనే డైలాగ్ వేసి నవ్వులు పండించాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com