Home

»

Tv News

Bigg Boss 10 Telugu: రోహిత్, వర్షిణిలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఏంటా బూతులు!

Nov 1, 2026 8:52AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఈ వారం మొత్తం త్రిగుణ్, వర్షిణి, రోహిత్ ట్రయాంగిల్ తోనే నడిచింది. అగ్నిపరీక్షకు ముందే త్రిగుణ్, వర్షిణి ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని హౌస్ లో కలిసి ఆడదామని ప్లాన్ వేసుకున్నట్లు నామినేషన్స్ ఎపిసోడ్ లోనే బయటపడింది. అయితే ఈ వారం GOAT పవర్ ఉన్న త్రిగుణ్ తన సొంత ఫ్రెండ్ వర్షిణినే నామినేట్ చేయడంతో ఆమె ఎమోషనల్ గా బ్రేక్ అయింది. "నువ్వు నా త్రిగుణ్ అన్నవి కాదు, నన్ను మోసం చేశావు" అంటూ పెద్ద గొడవ పెట్టుకుంది. 

నామినేషన్ గొడవ తర్వాత రాత్రి బెడ్ రూమ్ లో ఏరియాలో రోహిత్, వర్షిణి, ముఖేష్, సుధీర్, ఝాన్సీ కలిసి త్రిగుణ్ గురించి మాట్లాడుకున్న వీడియో వైరల్ అయింది‌. అందులో త్రిగుణ్ ని ఉద్దేశించి "వాడు P, D, B, TD" అంటూ కోడ్ లాంగ్వేజ్ లో బూతులు మాట్లాడారు.. అలాగే "ఎవడు బ్రోకర్, అన్న దూత" అంటూ పర్సనల్ గా టార్గెట్ చేశారు. ఇదంతా బిగ్ టీవీలో నాగార్జున చూపించాడడు. 

త్రిగుణ్ అందరి దగ్గరకు వెళ్లి మాటలు మోసుకెళ్తున్నాడు, దూతలా వ్యవహరిస్తున్నాడని రోహిత్ కామెంట్ చేశాడు. ఈ లాంగ్వేజ్ అంతా లైవ్ లో రికార్డ్ అయి ఉండటంతో ముందుగా వర్షిణిని పిలిచి "త్రిగుణ్ నిన్ను బయట కలిసి ఇంటికి రమ్మని ఫోన్ చేశాడా? లేదు కదా, నువ్వే కదా ఫోన్ చేసి ఇద్దరం కలిసి గేమ్ ఆడదామని ఒప్పందం చేసుకున్నావు? మరి గేమ్ లో భాగంగా నామినేట్ చేస్తే మోసం ఎలా అవుతుంది? ఫ్రెండ్షిప్ కి, గేమ్ కి తేడా తెలియాలి" అంటూ గట్టిగా క్లాస్ పీకాడు. 

అదే సమయంలో రోహిత్ ని కూడా వదల్లేదు. "ఒక అమ్మాయి ఏడుస్తుంటే పక్కన నిలబడి నవ్వుతావా? ఇదేనా నీ కల్చర్? P,D,B,TD అంటే ఏంటి రోహిత్? బ్రోకర్ అంటే ఏంటి? నీకు యెల్లో కార్డ్ ఇచ్చినా ఇంకా బూతులు మానవా?" అంటూ వీడియోలు ప్లే చేసి నిలదీశాడు. ఆ తర్వాత వర్షిణి-రోహిత్ ఇద్దరు కలిసి ఫౌల్ ఆడిన వీడియో ప్లే చేసి చూపించాడు నాగార్జున.

గత వారం నిన్ను జెంటిల్ మేన్ అన్నా కానీ ఏంటా బూతులు అంటు నాగార్జున అడుగగా సారీ సర్ అంటు ముఖేష్ అన్నాడు. ఎవరైనా నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారా అని నాగార్జున అడుగగా.. అవును సర్ దేబ్జానీ ఎందుకో నాకు నెగెటివ్ అయింది సర్.‌. అప్పటి నుండి నా చుట్టూ కొత్తవాళ్ళు వచ్చారంటూ తను వేరే మైండ్ సెట్ తో ఉన్నానని సారీ చెప్పాడు ముఖేష్. నాగార్జున ఫైరింగ్ తర్వాత వర్షిణి, రోహిత్, ముఖేష్ లు చాలా డల్ అయ్యారు. మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్ తో హౌస్ లో దోస్తీలు, దుష్మనీలు మరోసారి మారిపోయాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com