Home

»

Tv News

Bigg Boss 10 Telugu : పిచ్చిపట్టినట్టు చేస్తున్న ముఖేష్.. అతడి గురించి చెప్పిన దేబ్జానీ, త్రిగుణ్!

Oct 28, 2026 11:16AM

బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ లో ముకేష్ గౌడ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. నిన్నటి ఎపిసోడ్ లో ముఖేష్ కన్నింగ్ బయటపడింది. వర్షిణి ముందు దేబ్జానీ, త్రిగుణ్ కలిసి ముఖేష్ గురించి మాట్లాడారు.

నామినేషన్ లో వర్షిణిని త్రిగుణ్ నామినేట్ చేయడంతో వర్షిణి బాగా హర్ట్ అయింది. ఈ క్రమంలో ముకేష్.. త్రిగుణ్, వర్షిణి మధ్య ఒకరినొకరు నామినేట్ చేసుకోమని అండర్ స్టాండింగ్ ఉందని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీనిపై వర్షిణి త్రిగుణ్ ని నిలదీసింది.వెంటనే త్రిగుణ్ క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్య అలాంటి అండర్ స్టాండింగ్ ఏమీ లేదని చెప్పాడు. ఇదే విషయాన్ని దేబ్జానీ కూడా కన్ఫర్మ్ చేసింది. ముకేష్ క్యాజువల్ గా ఆ మాట అన్నాడే తప్ప సీరియస్ అలిగేషన్ కాదని దేబ్జానీ చెప్పడంతో ముకేష్ మాటలు అబద్ధమని తేలిపోయింది. దీంతో వర్షిణి ముందు ముకేష్ దొరికిపోయాడు.

ఇదే కాదు, ఈ సీజన్ మొత్తం ముఖేష్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర దేబ్జానీతో గొడవ, శివ పై అరోగెంట్ బిహేవియర్, RK ని ఫూల్ అనడం.. ఇలా ప్రతి ఎపిసోడ్ లో ముఖేష్ నెగెటివ్ గా కనిపిస్తున్నాడు. గత వీకెండ్ లో హోస్ట్ నాగార్జున కూడా.. ఏమైంది నీ క్యారెక్టర్? ఏమైంది నీ జెంటిల్ మెన్ బిహేవియర్?" అంటూ ముఖేష్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఒకప్పుడు దేబ్జానీతో క్లోజ్ గా ఉన్న ముఖేష్, ఇప్పుడు రోహిత్ కి దగ్గరవుతూ ఫ్రెండ్ షిప్స్ మారుస్తున్నాడని హౌస్ మేట్స్ అంటున్నారు. వర్షిణి దగ్గర చికెన్ మెనూ ఉందని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయడంతో ముకేష్ కన్నింగ్ స్టార్ అనే ముద్ర మరింత బలపడింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com