మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బుల్లితెరపై తనదైన కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం యాంకర్‌గా, నటుడిగా దూసుకుపోతున్నాడు . అయితే సుధీర్ కెరీర్‌తో పాటు ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆయన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అంటూ ఆడియన్స్ ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు . ఐతే ఇప్పుడు సుడిగాలి సుధీర్‌కు సంబంధించిన కొన్ని ఓల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి ఆయన నిశ్చితార్థానికి సంబంధించినవంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఫోటోల్లో ధనరాజ్, రాకింగ్ రాకేష్‌తో పాటు మరికొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఉండడంతో నెటిజన్స్ కి ఈ విషయం మీద ఆసక్తి పెరిగింది. గతంలో సుధీర్ కు ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యిందని , అయితే కొన్ని కారణాలతో ఆ పెళ్లి ఆగిపోయిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై సుధీర్ కూడా దీనిపైనా స్పందించలేదు. దీంతో ఈ ఫోటోలు నిజంగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించినవేనా అన్నదే ఇప్పుడు ఫాన్స్ ముందున్న ప్రశ్న. ఒకవేళ అలాంటిదే జరిగితే పెళ్లి ఎందుకు ఆగిపోయింది? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై సుధీర్ స్పందిస్తేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.
మరోవైపు సుధీర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలోనూ ఎన్నో స్టోరీస్ ట్రోల్ అయ్యాయి. ప్రేమలో ఎదురైన అనుభవాల కారణంగా ఆయన కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ప్రస్తుతం మాత్రం తన కెరీర్‌పై దృష్టి పెట్టిన సుధీర్.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఇక మూవీస్ విషయానికి వస్తే.. సుధీర్ నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘పాగల్’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నరేష్ కుప్పిలి ఈ మూవీ డైరెక్టర్. తమిళ మూవీ ‘బ్యాచిలర్’తో మంచి గుర్తింపు సంపాదించిన దివ్యభారతి ఈ మూవీ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం కానుంది. ఈ మూవీ షూటింగ్ 2023లోనే మొదలైనప్పటికీ , కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. తొలుత 2026 మార్చి 26న సినిమాను విడుదల చేయాలని భావించినా, అది నిర్ణయం కూడా వాయిదా పడింది .
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సుధీర్ పర్సనల్ లైఫ్ ఫొటోస్ ...
Oct 18, 2026 11:07AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




