Home

»

Tv News

Bigg Boss 10 Day 18:త్రిగుణ్ కి నోట మాట రాకుండా చేసిన మిథిలేష్..సీక్రెట్ ఓటింగ్ లో ముఖేష్ సంచలన కామెంట్!

Sep 25, 2026 9:59AM

వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత హౌస్ లో వాదనలు పీక్స్ కి చేరాయి. తనను కన్నింగ్ అని ఎందుకు అన్నావని మిథిలేష్ ని‌ రామ్ ప్రసాద్ ప్రశ్నించాడు. రన్ రాజా రన్ టాస్క్ లో కావాలనే అమన్ ని తీశావ్, ఎమోషనల్ గా ఉన్నవాళ్ల కోసం అమన్ ని పక్కన పెట్టినట్టు అనిపించిందని మిథిలేష్ అడిగాడు. అదే ప్రశ్నను త్రిగుణ్ కూడా అడగడంతో అసలు రచ్చ మొదలైంది.

 

నువ్వు ప్రతిసారీ మానిప్యులేట్ చేస్తున్నావ్..‌ రోహిత్ ని స్టెరాయిడ్స్ అని అనడం దారుణం..‌ముఖేష్ ని ముడ్డి కింద ముప్పై ఏళ్లు అనడం తప్పు అని మిథిలేష్ స్ట్రెయిట్ గా అన్నాడు. దానికి త్రిగుణ్ అది తెలుగులో సామెత కదా.. అది భాషాభిమానం అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అపూర్వ గారిని అడగండి అనడంతో మిథిలేష్ మరింత ఫైర్ అయ్యాడు. ఆమె ఎందుకు నాతో మాట్లాడాలి, నాక్కూడా స్వచ్ఛమైన తెలుగు వచ్చు అని మిథిలేష్ అన్నాడు. దానికి త్రిగుణ్ అయితే రెండు పద్యాలు చెప్పమని ఛాలెంజ్ చేశాడు. పద్యాలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు, పద్యాలు వస్తేనే తెలుగు వచ్చినట్టా అని ఎవరు చెప్పారు అని త్రిగుణ్ నోరు మూయించాడు మిథిలేష్. ఈ వాదనలో త్రిగుణ్ కి నోట మాట రాలేదు.

 

ఆ తర్వాత ముఖేష్, అపూర్వ మధ్య కూడా వాదన జరిగింది. నేను స్టార్ ప్లేయర్ అన్నట్టు ముఖేష్ చెప్పడంతో మీకు నలుగురే ఓట్లు వేశారు.. అది కూడా మీ కూటమి మెంబర్లే అని అపూర్వ కౌంటర్ ఇచ్చింది. చివరగా ఈ ముగ్గురిలో ఎవరు లోపలకు రావాలో సీక్రెట్ ఓటింగ్ వేయాలని బిగ్ బాస్ చెప్పాడు. మిథిలేష్ వస్తే సెట్ కాడు, బయటకు వెళ్లి జిమ్ ట్రైనర్ గా అవ్వమని ముఖేష్ అనడం రోహిత్ విని అంత అటిట్యూడ్ ఎందుకు అని షాలినీతో రోహిత్ అన్నాడు. రామకృష్ణ జెన్యూన్ అనిపిస్తున్నాడని కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటారు.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Wild Card, Mithilesh, Ram Prasad, Trigun, Apoorva, Mukesh Gowda, Rohith, Shalini, Secret Voting]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com