Home

»

Tv News

మెహబూబ్ దిల్ సే కొత్త ఇల్లు..!

Oct 2, 2026 11:39AM

బుల్లితెర మీద మెహబూబ్ దిల్ సే గురించి పరిచయం చేయక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. అలాంటి మెహబూబ్ సోషల్ మీడియాలో జిమ్   చేస్తూ హెల్త్ గురించి చెప్తూ కవర్ సాంగ్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఒక ఇల్లు కూడా రెడీ చేసుకుంటున్నాడు. "మై న్యూ హోమ్ సిరీస్ " పేరుతో ఆ ఇంటి గురించిన ఎపిసోడ్స్ గా చేస్తూ ఉన్నాడు.  

"కొత్త ఇల్లు. ఒక ఖాళీ కాన్వాస్. ఇంకా ఎన్నో ఆలోచనలు!    ఈ ఖాళీ స్థలాన్ని  నా సొంత అభిరుచికి తగ్గట్టుగా ఉండే ఇంటిగా మార్చుకోబోతున్నాను.  ఇంటీరియర్స్ ,  ఫర్నిచర్ నుండి  అన్ని విషయాలు నేనే డిసైడ్ చేసుకోబోతున్నాను.  నా కొత్త ఇంటి ట్రావెల్ గురించి ప్రతీది మీకు వివరిస్తాను.  ఇది ఒక అద్భుతమైన మార్పు కాబోతోంది.   నా కొత్త ఇంటి సిరీస్‌కు స్వాగతం " అంటూ ఎపిసోడ్ 1 లో చెప్పాడు. ఇక ఎపిసోడ్  2 చేసాడు. ఐతే ఇంట్లో వార్డ్ రోబ్ కావాలి ఇటు గ్లాస్ డోర్ కావాలి వెనక అంతా గ్లాస్ తో చేయించాలి అని చెప్పేసరికి వెనక నుంచి ఎవరో లచ్చ అవుద్ది అని చెప్పారు. రెండు లచ్చలైనా పర్లేదు అన్నాడు మెహబూబ్.

"ఇలా క్రియేటివ్ గా ఇది చేద్దాం అది చేద్దాం అనిపిస్తోంది. కానీ ఒక్కోదాని రేట్ లు చెప్తుంటే ఆ ఇప్పుడెందులే ఇవన్నీ అనిపిస్తోంది. హోమ్ సిరీస్ ఎపిసోడ్ 1 పోస్ట్ చేయగానే మా నాన్న ఫోన్ చేసి అర్జెంటు గా నువ్వు దర్గాకి వెళ్లి ఒక కొబ్బరికాయ తెచ్చి ఇంటికి కట్టు లేకపోతే నీకు దిష్టి తగులుద్ది అని చెప్పాడు. వెంటనే దర్గాకి వెళ్లి కొబ్బరికాయ తెచ్చి ఇంటికి కట్టేసాను" అని చెప్పాడు మెహబూబ్. "కొత్త ఇంటికి కోసం కావాల్సిన సామాన్లు ఒక్కొక్కటి కొనడం మొదలుపెట్టాను. కొత్తగా షూస్ పెట్టుకునేది కొన్నాను" అని చెప్పాడు. ఇక నెటిజన్స్ ఐతే కొంతమంది కంగ్రాట్యులేషన్స్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది ఐతే ఈ సిరీస్ వల్ల ఇంకా ఎక్కువ దిష్టి కొడుతోంది. ఈ సిరీస్ చేయకు అంటూ సలహా ఇస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com