Home

»

Tv News

సుమ తర్వాత వంటల షోల్లో యాదమ్మ రాజుదే హవా.. టేస్టీ తేజకు పెళ్లి టిప్స్

Oct 12, 2026 6:25PM

సన్ జెమినిలో వంటస్టిక్ ప్రోగ్రాం ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. హోస్ట్ గా టేస్టీ తేజ రావడం కొంతమంది ఇండస్ట్రీ నుంచి గెస్టులను తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తూ రకరకాల డిషెస్ చేయడం ఈ ప్రోగ్రాం స్పెషలిటీ. రీసెంట్ ఎపిసోడ్ కి కమెడియన్ యాదమ్మ రాజు వచ్చాడు. అతన్ని పెళ్లి గురించి కొన్ని  టిప్స్ అడిగాడు టేస్టీ తేజ .

"నిజానికి యాదమ్మ రాజుకు వంటొచ్చో లేదో తెలీదు కానీ వంటల షోలు చేసి చేసి అలవాటైపోయింది. నాకు తెలిసి ఇండస్ట్రీలో సుమ గారి తర్వాత వంటల షోస్ ఎక్కువగా చేసింది యాదమ్మ రాజు. నువ్వు నా కంటే సీనియర్ వి వండటంలో, వంట చెడగొట్టడంలో, పెళ్లి చేసుకోవడంలో . కాబట్టి నీ సీనియారిటీ నుంచి నాకు కొన్ని పెళ్లి టిప్స్ కావాలి" అని టేస్టీ తేజ అడిగాడు. "చేసుకో పెళ్లి. మంచిగా ఉంటుంది " అన్నాడు యాదమ్మ రాజు.

"పెళ్ళానికి కోపం వచ్చినప్పుడు ఏ వంట చేసి కూల్ చేస్తావ్ " అని అడిగాడు టేస్టీ తేజ. వెంటనే యాదమ్మ రాజు "ఆర్డర్ చేసి కూల్ చేస్తా. ఎందుకంటే వంటి చేస్తే ఇంకా కోపం వస్తుంది కాబట్టి . మనం వంట చేస్తే తినలేరు కాబట్టి కోపం వచ్చినప్పుడు ఆమెకు నచ్చింది  ఆర్డర్ పెట్టుకుంటే  వాళ్ళు కూల్ ఐపోతారు " అని చెప్పాడు. "నీకు కోపం వచ్చినప్పుడు నీ భార్య నీకు ఎం వండిపెడుతుంది" అని అడిగాడు. "నాకు కోపం వచ్చినప్పుడు ఆమె ఏమీ వండిపెట్టదు . అప్పుడు నాకు నేనే ఆర్డర్ పెట్టుకోవాలి. " అన్నాడు యాదమ్మ రాజు. "ఎవరికీ కోపం వచ్చినా నువ్వు ఆర్డర్ పెట్టాలి. అంటే సరెండర్ ఇపోయావన్న మాటా " అని టేస్టీ తేజ అనేసరికి "అది సరెండర్ ఐపోవడం కాదు ప్రేమ " అన్నాడు. "నాకు పాప పుట్టాక బాధ్యతలు చాలా పెరిగాయి. అబ్బాయి పుడితే అంత ఉండేది కాదు కానీ అమ్మాయి పుట్టింది చాలా ఆనందంగా. నన్ను డాడీ అని పిలవదు. బేబీ బేబీ అని పిలుస్తుంది. " అని చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com