Podharillu : రౌడీలతో ఆది దాడి.. స్వల్ప గాయాలతో కన్నా!
on Jan 22, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో......చక్రిని మహా పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. మీ వాళ్ళు నేను ఇక్కడే ఉంటానని అనుకుంటున్నారు ఇవన్నీ ఏర్పాట్లు ఏంటి వాళ్ళకి చెప్పండి లేదా నేనైనా చెప్తానని మహా అంటుంది. వాళ్లకి నేను చెప్తాను కానీ ఇప్పుడే కాదు ప్లీజ్ అర్ధం చేసుకోండి అని చక్రి అనగానే మహా సరే అంటుంది. మరొకవైపు మాధవ వంట చేస్తాడు. అసలు వదిన ఇక్కడ అడ్జెస్ట్ అవుతుందా వచ్చినప్పుటి నుండి ఇంటిని అదోలా చూస్తుందని కన్నా అంటాడు. చక్రి అన్ని విషయాలు చెప్పే ఉంటాడులే అని మాధవ అంటాడు.
ఆ తర్వాత చక్రి ఇంటికి అది రౌడీలని తీసుకొని వస్తాడు. చక్రిని కొట్టబోతుంటే ముగ్గురు అన్నదమ్ములు అడ్డువస్తారు. ఆదిని నారాయణ కొట్టబోతుంటే మా అన్నయ్య అని చెప్తుంది. దాంతో ఆగిపోతాడు. కేశవ వాళ్ళు ఆది పైకి వెళ్తుంటే ఆది అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కన్నాకి చిన్న గాయం అవుతుంది. మహా తనకి బ్యాండెజ్ వేసి సారీ చెప్తుంది. మరొకవైపు సొసైటీ లో ఎలా బతకాలి ఈ అవమానం భరించలేనని ప్రతాప్ సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత మహా పడిపోబోతుంటే మాధవ, కేశవ, కన్నా జాగ్రత్త అంటారు. మా నాన్న కూడ ఇలాగే అనేవారు ఎంత బాధపడుతున్నాడోనని మహా అంటుంది. మహా స్నానానికి వెళ్తుంది కానీ బాత్రూం లో లైట్ ఉండదు. ఆ విషయం ఇంట్లోకి వచ్చి చెప్పగానే అందరు ఫోన్ టార్చు ఆన్ చేసి ఇస్తారు. కేశవ ఫోన్ తీసుకొని మహా వెళ్తుంది.
ఆ తర్వాత మహాకి భోజనం వడ్డీస్తాడు మాధవ. అందరు తనని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత చక్రి నీకు సర్ ప్రైజ్ అంటూ తన కళ్ళు మూసి గదిలోకి తీసుకొని వెళ్తారు. వెళ్లేసరికి గది మొత్తం పూలతో డెకరేషన్ చేస్తారు. దాన్ని చూసి చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



