Home

»

Tv News

నటరాజ్ - నీతూ, వాసంతి - పవన్ కళ్యాణ్ మధ్య గట్టిగ యుద్ధం!

May 18, 2026

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో రీసెంట్ ఎపిసోడ్ లో ప్రేమ గురు ఒక టాస్క్ ఇచ్చాడు. అది ప్రామిస్ కీపర్ - ప్రామిస్ బ్రేకర్. ఏ జంట లవ్ మాన్షన్ లోకి వచ్చే ముందు వాళ్ళు హ్యాండ్ కాస్ట్ చేసుకుని వాళ్ళు ప్రామిస్ ని రాశారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ ఎండింగ్ కి వచ్చేసరికి చాలా టఫ్ చేసేస్తున్నారు. ఇక టాప్ 5 లో నటరాజ్ మాష్టర్ - నీతూ, నూకరాజు - ఆసియా, మహేష్ - సాండ్రా, వాసంతి - పవన్ కళ్యాణ్, జాను - భాను ఉన్నారు.

ఇక లవ్ గురు ఎం చెప్పాడంటే మాన్షన్ లో కి వచ్చాక ఏ జంట ఎం ప్రామిస్ చేశారో అది ఏ జంట నిలబెట్టుకున్నారో ఏ జంట నిలబెట్టుకోలేదు అడిగారు. దాంతో ఆసియ-నూకరాజు జోడి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నారంటూ అందరూ చెప్పారు. ఇక ప్రామిస్ బ్రేకర్స్ గా వాసంతి - పవన్ కళ్యాణ్ జోడికి 3 ఓట్లు, నటరాజ్ - నీతూకి 2 ఓట్లు పడ్డాయి.

ఇక లాస్ట్ ఎపిసోడ్ లో వాసంతి మీద నూకరాజు వేసిన జోక్ కి పవన్ కళ్యాణ్ ఫీలయ్యాడు. ఆ విషయంగా పవన్ కళ్యాణ్ మైండ్ లో ఉన్న నెగటివ్ థాట్స్ ని ఆసియా మాట్లాడి సాల్వ్ చేసింది. ఇక నూకరాజు తానూ వాసంతి మీద ఆ విధమైన జోక్ వేసినందుకు ఫీలవుతూ కమెడియన్ కాకూడదు అని అనుకున్నాడు. దాంతో వాసంతి వచ్చి "ఆ ఒక్క మాట బాధ కలిగింది.

కమెడియన్స్ ఏమీ తక్కువ కాదురా. దేనిలో తక్కువ కాదురా కమెడియన్స్ అర్ధమవుతుందా నీకు నాలుగు తగిలిస్తా నీకు. పవన్ కళ్యాణ్ కి పెట్టె మనస్తత్వం ఉంది కానీ కొంచెం సిగ్గరి. నన్ను ఎమన్నా అంటే అస్సలు తట్టుకోలేడు. అదొక్కటే కానీ మిగతా అంత చాలా మంచోడు. నూకరాజు మీద నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎమన్నా కామెంట్స్ చేసి ఉంటె సారీ ఆంటీ   " అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ అమ్మకు ఈ షో ద్వారా సారీ చెప్పింది వాసంతి. ఐతే మహేష్ - సాండ్రాకి మాత్రం ప్రామిస్ కీపర్ లో కానీ ప్రామిస్ బ్రేకర్ లో కానీ ఒక్క ఓట్ కూడా రాలేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com