.webp)
సోషల్ మీడియాలో కౌశల్ ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. బిగ్ బాస్ కి వెళ్లి కౌశల్ ఆర్మీ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే రీసెంట్ గా మోడలింగ్ అకాడమీ కూడా స్టార్ట్ చేసాడు. ఇక ఇప్పుడు ఒక మూవీలో కూడా నటించాడు. ఆ మూవీ ఇప్పుడు ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద ఉందని చెప్పాడు. అలాగే శరత్ కుమార్ కౌశల్ కి విషెస్ చెప్తూ కౌశల్ హార్డ్ వర్కింగ్ అంటూ మెచ్చుకున్నారు. సెట్స్ లో ఆయన్ని చూసాను. అప్ కమింగ్ స్టార్ అంటూ కూడా పొగిడారు. ఇక కౌశల్ కూడా ఆ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
‘రైట్’ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై టాప్ యాక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తూ తన నటనను ప్రశంసిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమ, ప్రోత్సాహం, అభినందనలు తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయన్నారు. ఇంకా ‘రైట్’ సినిమా చూడని వారు వెంటనే ఆహాలో సినిమా చూసి, తన నటనపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని కోరారు. ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఇదే ప్రేమాభిమానాలను, ఆశీస్సులను ఎప్పటికీ అందించాలని ఆమె కోరారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ‘రైట్’ సినిమాను ఆహాలో చూసి మీ అభిప్రాయాలను పంచుకోండి! అని కోరారు.
ఇక నెటిజన్స్ ఐతే "పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చాలా బాగున్నారు సర్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ సర్ . కంగ్రాట్యులేషన్స్ అన్నా. మీ కష్టానికి అందరూ జోహార్లు చెప్పారు. శరత్ కుమార్ గారితో ప్రశంసలు అందుకోవడం మాములు విషయం కాదు. ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్ ఉంది. " అంటూ కామెంట్స్ చేశారు.




.webp)

