
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ కెవ్వు కార్తిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ మీద యాక్టివ్ గా ఉంటాడు. తన పర్సనల్ లైఫ్ కి సంబందించిన డీటెయిల్స్ ని కూడా సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ఒక గొప్ప సందర్భాన్ని ఫాన్స్ తో పంచుకున్నారు. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా పోస్ట్ చేసుకున్నాడు. తన కూతురికి అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయాన్ని ఆయన చాలా ఆనందంగా చెప్పాడు.
జబర్దస్త్‌లోకి వచ్చిన కొత్తల్లో అవినాష్‌తో కలిసి స్కిట్స్ చేసిన కార్తిక్.. ఆ తర్వాత తనదైన కామెడీతో టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కమెడియన్‌గా మాత్రమే కాకుండా టీమ్ లీడర్‌గా కూడా ఆడియన్స్ ని అలరించారు. ఇక రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న ఆయన.. ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు.
తన కూతురికి సంబంధించిన ప్రతీ మూమెంట్ ని అభిమానులతో పంచుకుంటున్న కెవ్వు కార్తిక్.. రీసెంట్ గా తన కూతురికి ఐదు నెలలు పూర్తయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే మరో గుడ్ న్యూస్ ని కూడా ఫాన్స్ తో ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు. తన గారాల పట్టి శ్రీకరికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ఎంతో ఘనంగా జరిపించారు. పట్టు వస్త్రాలు ధరించిన చిన్నారి శ్రీకరిని చక్కని కాస్ట్యూమ్స్ తో అలంకరించి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసాడు.
ఈ ఫొటోలు చూసిన అభిమానులు చిన్నారి శ్రీకరి చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు, అభిమానులు కార్తిక్ దంపతులకు విషెస్ చెప్తున్నారు. ప్రస్తుతం కెవ్వు కార్తిక్ కూతురి అన్నప్రాసన వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




.webp)

