.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2 ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-810లో.. జ్యోత్స్నను సుమిత్రకు అప్పగించి వచ్చానని, ఇక ఆఫీసుకు, ఇంటికి రావొద్దని చెప్పానని సూరజ్ చెప్తాడు. తాత అని పిలిస్తే తాట తీస్తానని శివనారాయణ అన్నాడని..మనమే మారాలని అంటాడు. నా కొడుకు దగ్గర మనవరాలిని పీఏగా పంపిస్తారా.. పరువు కాళ్ల దగ్గర పెట్టినట్టే అని శివనారాయణ ఫీల్ అవుతాడని మాలిని లోపల్లోపల ఆనందపడుతుంది. కానీ దక్షిణామూర్తి మాత్రం వాడు ఏమైనా ఫీల్ కానీ నా కూతురు, మనవరాలు నా దగ్గరకు రావాలి. జ్యోత్స్న ఆఫీసుకు వస్తుందని అనడంతో సూరజ్ జ్యోత్స్న రాదు తాతా అని తెగేసి చెప్తాడు. జ్యోత్స్న పీఏగా చేరిన విషయం లేటుగా తెలిసిందని, ఇప్పుడు బాబాయి, సుమిత్ర, దశరథ్ ఎవరూ రానివ్వరని మాలిని అంటుంది. నీకు కావాల్సింది ఇదే కదమ్మా, ఎప్పుడూ నువ్వు అనుకున్నదే జరుగుతుందంటూ దక్షిణామూర్తి అన్నం తినకుండా వెళ్లిపోతాడు. సూరజ్ కూడా తినకుండా లేచిపోతాడు.
మరోవైపు కాంచన ఇంట్లో జ్యోత్స్నను అందరు చుట్టుముట్టి రేపటి నుంచి జాబ్ కి వెళ్లొద్దని.. సూరజ్ దగ్గర పీఏగా చేయొద్దని చెప్తారు. కానీ జ్యోత్స్న మాత్రం సూరజ్ దగ్గర పీఏగా చేయొద్దని తప్ప ఏం చెప్పినా వింటానని అంటుంది. నువ్వు ఆఫీసులో అడుగుపెట్టొద్దని సూరజ్ ముఖం మీదే చెప్పాడని సుమిత్ర అంటుంది. అప్పుడు జ్యోత్స్న మొదలెడుతుంది. నాకు మాలిని, దక్షిణామూర్తి, సూరజ్ మాటలే వినపడుతున్నాయి. నేను చేరిన జాబ్ ని మాలిని తీసేయించింది. వేరే జాబ్ రాకుండా చేస్తానంది. వాళ్లకు భయపడి వదిలేస్తే లూజర్ అవుతా నేను ఫైటర్ ని, నన్ను ఛాలెంజ్ చేసిన వాళ్లకు నేనే ఛాలెంజ్ గా మారా.. ఏ ఆఫీసు నుంచి మనల్ని గెంటేశారో అక్కడే జాబ్ చేస్తున్నానని తెగేసి చెప్తుంది. తను కుటుంబం కోసమే నిలబడతానని, ఎవరూ ఆగిపోలేదని అందరి గురించి చెప్తుంది.
దీంతో కార్తీక్, దీప కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. నేను అదే ఆఫీసులో సీఈఓగా చేస్తున్నా కానీ వాళ్లు టార్గెట్ చేసింది నిన్ను అని దీప అంటుంది. మనకు మనం సమాధానం చెప్పుకోవాలి.. అమ్మానాన్న, తాత బాధపడుతుంటే నువ్వు ఆలోచించాలని కార్తీక్ చెప్తాడు. కానీ జ్యోత్స్న మాలిని ఆఫీసులో అడుగుపెట్టడం గెలుపు కాదా అంటూ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో కార్తీక్, దీపకి సుమిత్ర ఆఫర్ ఇస్తుంది. నా కూతురు సూరజ్ దగ్గర పని చేయొద్దుం.. మీరు ఆపగలరా అని అడుగుతుంది. జ్యోత్స్నను ఆపగలిగితే క్షమిస్తామని శివనారాయణ, దశరథ్ కూడా ఆఫర్ ఇస్తారు. నా భర్త కాదు నేను కూడా నిన్ను కూతురే అనుకుంటా.. నీ చెల్లెలి జీవితం కోసం నువ్వు ఏం చేయకుండా ఉంటావా అని దీపతో సుమిత్ర అంటుంది. చివర్లో జ్యోత్స్న ఉదయం రెడీ అయి తాత జేబులో నుంచి ఆటో ఛార్జ్ కోసం 100 రూపాయలు తీసుకుని ఆఫీసుకు బయలుదేరుతుంటే కార్తీక్ ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
