Home

»

Tv News

Karthika Deepam2 Today: సూరజ్ వర్సెస్ మాలిని.. జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది!

Oct 13, 2026 10:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్  సోమవారం నాటి ఎపిసోడ్-802లో.... సూరజ్ ఇచ్చిన 15 కోట్ల ఆఫర్ ని కార్తీక్ తిరస్కరించడంతో అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. మరో వైపు మాలిని తన కొడుకు సూరజ్ ని నువ్వు నా కొడుకువే కాదు అంటూ షాక్ ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. శివన్నారాయణ టిఫిన్ బండి దగ్గర వచ్చిన డబ్బులను లెక్కేసుకుంటూ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను.. డబ్బుదేం ఉందిలే అనుకున్నా కానీ డబ్బే శాశ్వతం, డబ్బు పోయాక మర్యాద పోయింది, గౌరవం పోయింది, డబ్బుతో పాటు సర్వం కోల్పోయా, ధనమే అన్నింటికీ మూలం అనే మాట మరోసారి నిజమైందని అంటాడు. అప్పుడు కార్తీక్ అవును తాతా కానీ మనిషికి డబ్బుతో పాటు చాలా మూలాలు ఉన్నాయి అంటాడు. నా చేతిలో ఈరోజు ఈ డబ్బు ఉండటానికి నువ్వు ఇచ్చిన సలహానే కారణం అంటూ కార్తీక్ కి శివన్నారాయణ థాంక్స్ చెప్తాడు. అప్పుడే కాంచన.. నువ్వు వాడి తాతవి, నీకు సాయం చేయడం వాడి బాధ్యత అంటుంది. కార్తీక్ అందరికి సాయం చేస్తాడు, అలా సాయం చేసే కోట్ల అధిపతి అయిన నన్ను చిల్లర లెక్కపెట్టుకునే శివన్నారాయణగా మార్చాడు.. వీడు చేసిన సాయం జన్మలో మర్చిపోలేనంటూ కార్తీక్ ని ఇండైరెక్ట్ గా తిడతాడు.

మరోవైపు గతంలో మాలిని కార్తీక్ ఫ్యామిలీని కొనడానికి ప్రయత్నించి 10 కోట్ల ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు సూరజ్ 15 కోట్ల ఆఫర్ తో కార్తీక్ దగ్గరకు వస్తాడు. మాతో కలిసిపోతే మీ జీవితాలు మారిపోతాయని, మీ కాల్ కోసం ఎదురు చూస్తుంటా అంటూ మాలిని చెక్ ఇచ్చి వెళ్తుంది. కానీ కార్తీక్ ఆ ఆఫర్ ని స్ట్రాంగ్ గా తిరస్కరిస్తాడు. మమ్మల్ని డబ్బుతో కొనలేరు, మా ఆత్మాభిమానం అమ్ముకోము అంటూ ఫైర్ అవుతాడు. సూరజ్ తమ్ముడు ఎలాంటి వాడో కనిపెట్టలేకపోయాడు పాపం అని దశరథ అంటే, కార్తీక్ తో వాదన పెరుగుతుంది.

ఈ క్రమంలోనే సూరజ్, మాలిని మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. టిఫిన్ బండి వ్యవహారంలో కార్తీక్ కొట్టిన దెబ్బకు మాలిని షాక్ అయి ఉంటుంది. సూరజ్ వచ్చి నీ గుండె అగ్నిపర్వతంలా మండిపోతుందమ్మా అంటాడు. నీ తల్లిని కార్తీక్, దీప అవమానించారని మాలిని అంటే, సూరజ్ రివర్స్ లో ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న జాబ్ విషయం తాత చెప్పొద్దన్నా నువ్వు చెప్పాలని చూశావని నిలదీస్తాడు. దీంతో కోపంలో మాలిని నువ్వు నా కొడుకువే కాదంటూ సూరజ్ కి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. దీంతో అన్నదమ్ములైన కార్తీక్, సూరజ్ మధ్య యుద్ధం మొదలైనట్టు అయింది.

మరోవైపు దశరథ, సుమిత్ర జ్యోత్స్న కోసం టెన్షన్ పడుతుంటారు. 24 గంటలు దాటినా కూతురు ఇంటికి రాలేదు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు అని ఏడుస్తుంటారు. మీకు నిజం తెలుసు అయినా చెప్పరని కార్తీక్, దీపలను నిలదీస్తారు. దానికి కార్తీక్, దీప మాకు తెలియదని, కావాలంటే బిడ్డపై ప్రమాణం చేస్తామని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com