Home

»

Tv News

Karthika Deepam2 : సూరజ్ కి షాక్ ఇచ్చిన జ్యోత్స్న.. మాలిని డౌట్ నిజమే !

Oct 28, 2026 12:12PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1173 లో......జ్యోత్స్న తింటూ ఉంటే సూరజ్ కాల్ చేస్తాడు. ఆఫీస్ నుంచి వచ్చి ప్రశాంతంగా తిందామంటే మీ వాళ్లు గొడవకు వచ్చారు. నువ్వే సూత్రధారివి కదా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి బయటకు రా అని సూరజ్ అంటాడు. నేను రాను అని జ్యోత్స్న అంటే నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తానని బెదిరిస్తాడు. అందరూ కోపంగా ఉన్నారు, నిన్ను ఉతికి ఆరేస్తారని జ్యోత్స్న అంటే నువ్వే పిలిచావని  చెబుతా అని సూరజ్  అంటాడు. చివరకు సూరజ్ చెప్పిన లొకేషన్ కి జ్యోత్స్న వెళ్తుంది.

 హాయ్ సర్ అని జ్యోత్స్న అంటే సర్ ఎందుకులే, ఫ్రెండ్ లా పిలువమని సూరజ్ అంటాడు. హాయ్ రా..  ఏంట్రా పిలిచావని   జ్యోత్స్న అనగానే సారే బెటర్ అని సూరజ్  అంటాడు. ఉదయం నీ మీద పేపర్లు విసిరినందుకని సూరజ్ సాగదీస్తే .. సారీ చెబుదామని పిలిచారా జ్యోత్స్న అని అడుగుతుంది. సూరజ్ సారీ చెప్పకుండా.. ఇంకోసారి ఇలా చేస్తే చేతికి ఏం దొరికితే అది విసిరేస్తానని అంటాడు. జ్యోత్స్న కామెడీ చేస్తూ.. మాలాంటి వాళ్లు అంటే మీకు చులకన అని అంటుంది. రేపు ఉదయం 9 లోపు వారం మొత్తం షెడ్యూల్ నాకు ఇవ్వాలని సూరజ్  ఆర్డర్ వేస్తాడు. వెళ్తూ వెళ్తూ .. సర్ మనసులోనిది చెప్పకపోతే నిద్ర పట్టదని చెప్పి వెళ్తుంది జ్యోత్స్న.

ఇంటికి రాగానే దీప, కార్తీక్ లు .. ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్లావని  అడుగుతారు. సూరజ్ ఏమన్నాడు అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. తినేటప్పుడు ఫోన్, స్కూటీ లేదు, నువ్వు లేవు, ఆ మాత్రం తెలీదా, మాలిని అత్త గొడవ చేసిన విషయం గుర్తుందా, అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని దీప ఫైర్ అవుతుంది. నేను తప్పులు చేస్తూనే ఉంటా, సూరజ్ చేసిన తప్పులన్నీ సరిదిద్దే వరకు అని జ్యోత్స్న   అంటుంది.

ఉదయం మాలిని వాళ్లు టిఫిన్ చేస్తుండగా ..రాత్రి ఎక్కడికి వెళ్లావని   మాలిని  అడుగుతుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి సూరజ్ చేతిలో వారం షెడ్యూల్ పెడుతుంది. నిన్న మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే మళ్లీ మా ఇంటికి వచ్చావని  మాలిని అంటే ..మీరు మా ఇంటికి వచ్చారా ఎప్పుడు అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com