.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -814 లో.....శౌర్యకు లెక్కలు రాకపోతే దశరథ్ పక్కన కూర్చోబెట్టి చెప్తాడు. తాతా నువ్వు మా స్కూల్లో టీచర్ అయిపోవచ్చు కదా అని శౌర్య అంటే మీ అమ్మ నిన్ను కలెక్టర్ గా చూడాలనుకుంది, మా ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా నువ్వు బాగా చదువుకోవాలని దశరథ్ ఎమోషనల్ గా అంటాడు.
భోజనం టైంలో జ్యోత్స్న శివన్నారాయణను కూల్ చేయడానికి వెళ్తుంది. జ్యోత్స్న వడ్డిస్తుంటే శివన్నారాయణ.. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాల్సిన అవసరం లేదని ఈరోజే తెలిసింది, గౌరవం లేని ఇష్టాలను దూరంగా ఉంచడమే మంచిదని జ్యోత్స్నను ఉద్దేశించి అంటాడు. అందరూ ముద్ద నోట్లో పెట్టబోతుండగా.. రేయ్ శివన్నారాయణ అంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తాడు. ఈ ఇంట్లో అడుగు పెట్టనన్న నన్ను పెట్టేలా చేశావని అంటాడు.
నా మనవరాలితో మాట్లాడటానికి వచ్చా అని దక్షిణామూర్తి అంటే అలాంటి వాళ్లు ఎవరూ లేరని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న మాత్రం.. చెప్పు తాతా అంటుంది. అప్పుడు మాలిని.. జ్యోత్స్న నా మీద కేసు పెట్టింది, వెనక్కి తీసుకోమనండి అని అరుస్తుంది. కేసు పెట్టి తప్పు చేశావమ్మా, ఒకరిపై కాదు ముగ్గురిపై పెట్టాలని శివన్నారాయణ అంటాడు. తప్పు చేసి దొరికిపోయిందని బాధ అని దీప అంటే నా భార్యను అంటే ఊరుకోనని కార్తీక్ అంటాడు. కేసు వెనక్కి తీసుకోను, ఇదే నా మాట అని సుమిత్ర తెగేసి చెప్తుంది .
సుమిత్ర చిరిగిపోయిన చీర చూసి దక్షిణామూర్తి కన్నీళ్లు పెడతాడు . ఏంటమ్మా ఈ గతి, నువ్వు, జ్యోత్స్న మన ఇంటికి వచ్చేయండి.. మాలిని వీళ్ల దగ్గర తీసుకున్న ఆస్తి మొత్తం ఇచ్చేద్దాం.. ఒక్క పైసా వద్దు.. కావాలంటే నన్ను జైలుకు పంపు అని అంటాడు. బేరం కుదరలేదు నాన్నా, కోడల్ని కాపాడుకోవడానికి దొంగ కన్నీళ్లు అని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
