.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-811లో.. జ్యోత్స్న ఆఫీస్ కి వెళ్తానని అంటే ఇంట్లో పెద్ద గొడవ మొదలవుతుంది. జ్యోత్స్నను ఆపమని అందరు కార్తీక్, దీపలకు బాధ్యత ఇస్తే కార్తీక్ మాత్రం.. మేం ఆ బాధ్యత తీసుకోం, మాకు లక్ష్యం ఉన్నట్టే తనకీ ఉంటుంది. తను PA గా చేయాలనుకుంటే చేయొచ్చని తెగేసి చెప్తాడు. దీనికి శివన్నారాయణ.. శభాష్ రా మాలిని మనుషులు అనిపించుకున్నారని తిడితే.. సుమిత్ర.. నా కూతురికి మా నాన్నే జాబ్ ఇచ్చాడని తెలుసు కానీ వెనక మీరే ఉన్నారని తెలుసని కార్తీక్ ని నిలదీస్తుంది.
నా బావ కార్తీక్ ను చూసి ఎలా బతకాలో నేర్చుకున్నా.. చెట్టులా ధైర్యంగా నిలబడటం నేర్చుకున్నానని జ్యోత్స్న అంటే నా గొంతులో ప్రాణం ఉండగా వెళ్లనివ్వను.. నువ్వు వెళ్తే నా ప్రాణం పోయినట్టేనని సుమిత్ర చేయి పట్టుకుని ఆపుతుంది. నన్ను ఆపితే నేను చచ్చిపోతా.. నేను మొండిదాన్ని. మాట కంటే ప్రాణం ఎక్కువ కాదని జ్యోత్స్న ఎదురించడంతో ఆ టైంలో దశరథ్ ఎంట్రీ ఇచ్చి.. చేయి వదిలేయ్ సుమిత్రా.. పిల్లలకు పోరాటం నేర్పించాలి.. వెళ్లమ్మా ధైర్యంగా వెళ్లు నీ వెనక నీ నాన్న ఉన్నాడు.. నా కూతురు లూజర్ కాదు ఫైటర్ అని నిరూపించమని జ్యోత్స్నకు అండగా నిలబడి ఆఫీస్ కి పంపిస్తాడు దశరథ్.
ఆఫీస్ లో మాలిని, సూరజ్ జ్యోత్స్న రాదని అనుకుంటుండగా దక్షిణామూర్తి వచ్చి.. అది సుమిత్ర కూతురురా, రాకపోతే సుమిత్ర కూతురే కాదని చెప్తాడు. చెప్పినట్టే జ్యోత్స్న ఆఫీస్ కి రావడంతో మాలిని..ఏదో పథకం ప్రకారమే వచ్చింది, జింక పిల్ల అనుకుంటే పులి పిల్లవే అని సెటైర్ వేస్తుంది. చివర్లో జ్యోత్స్న ఛైర్మన్ షెడ్యూల్ చేస్తే ప్లానింగ్ బాలేదని సూరజ్ కోపంతో జ్యోత్స్న ముఖం మీద పేపర్లు విసిరికొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

