.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -792 లో......ఎంతో కష్టపడి సంపాదించుకున్న జాబ్ పోయిందని జ్యోత్స్న కన్నీరు పెట్టుకుంటుంది. నా జాబ్ పోవడానికి మీరే కారణం, నువ్వు అన్నీ మీ అమ్మకి చెప్తావ్.. నీకు నా దగ్గర మీ అమ్మ డ్యూటీ వేసిందంటూ సూరజ్ పై ఫైర్ అవుతుంది.
నేను ఏం చెప్పలేదు, ఓనర్ ని అడుగమని చెప్పినా జ్యోత్స్న నమ్మదు. నేను ఉన్న చోటుకి నువ్వు వస్తావ్.. దక్షిణామూర్తి తాత వస్తాడు.. నేను కేఫ్ లో పని చేస్తున్నా అని మీ తాత మా తాతకి చెప్పాడు.. రాత్రంతా ఇంట్లో పెద్ద గొడవ.. నాతో వాదించలేక మా వాళ్లు వదిలేశారని జ్యోత్స్న బాధపడుతుంది. తన సంపాదనతో అమ్మానాన్న కడుపు నిండా తింటారనే చిన్న ఆశ కూడా చంపేశారని జ్యోత్స్న ఏడుస్తుంది. సూరజ్ దండం పెట్టి అర్థం చేసుకోమని బ్రతిమాలినా, తన తల మీద చెయ్యి పెట్టి ఒట్టేయమని జ్యోత్స్న డిమాండ్ చేస్తుంది.
మరోవైపు దీప ఆఫీస్ లో మాలినికి చుక్కలు చూపిస్తుంది. ఫైల్స్ చూస్తూ ఉండగా కార్తీక్ ఇచ్చిన ఐడియాతో ఇంగ్లీష్ ఫైల్స్ ని తెలుగులోకి మార్చే యాప్ తో చెక్ చేస్తుంది. మాలిని ఎవరు, తన పోస్ట్ ఏంటి, నేను సీఈఓని, తను ఎవరు అడగడానికి" అంటూ మాలిని పీఏను, మాలినిని దీప ప్రశ్నలతో విసిగించి పిచ్చెక్కిస్తుంది. దెబ్బకి పీఏ జాబ్ మానేస్తుంది. సూరజ్ మాలినితో.. మనకి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా, జ్యోత్స్న రెస్టారెంట్స్ తప్ప అని అడుగుతాడు. దీంతో మాలిని కేఫ్ ఓనర్ ని గుర్తుచేసుకుని కంగారుపడుతుంది.
చివర్లో జ్యోత్స్న బాధగా కూర్చుంటే కార్తీక్, దీప వచ్చి ఏమైందని అడుగుతారు. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు బావా.. ఇంకెవరు మనల్ని నడిరోడ్డు మీదకు లాగిన మహానుభావులే, ఓనర్ ని బెదిరించి తీయించేశారని చెప్తుంది. మీ ఇంట్లో తిన్న ప్రతీ మెతుకు మా గొంతులో గుచ్చుకున్నట్లు ఉంది బావా అంటూ ఎమోషనల్ అవుతుంది. కారు లేకపోతే తిరగలేని జ్యోత్స్నలో ఇంత మార్పు ఏంటని దీప అంటే.. శివన్నారాయణ మనవరాలిగా బతుకుతుందని కార్తీక్ అంటాడు. ఇంతలో పారు బయట కంగారుగా నిల్చుని శివన్నారాయణ బయటకు వెళ్లి ఇంకా రాలేదు.. కనపడటం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

