Home

»

Tv News

Karthika Deepam2 :జ్యోత్స్న నా కూతురు కాదు, దశరథ్ కూతురే.. షాకిచ్చిన దాసు!

Sep 30, 2026 9:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 791 లో....పారిజాతం జ్యోత్స్న పెళ్లి పనులు మొదలుపెట్టింది. కొన్ని పెళ్లి కొడుకుల ఫోటోలు తీసుకొచ్చి ఒకర్ని సెలెక్ట్ చేసుకోమని పారు జ్యోత్స్నను అడుగుతుంది. ఏం అవసరం లేదు.. నా జీవితంలో ఒక డ్యామేజ్ జరిగింది, దాని నుంచి కోలుకోవడానికి దారి వెతకాలి.. నన్ను ఇంక వదిలేయ్ అని చెప్పేసి జ్యోత్స్న వెళ్లిపోతుంది. పారు వెంటపడి హాల్లోకి వెళ్లి అందరి ముందు.. ఇలాంటి జీవితం నీకు అవసరం లేదు, పెళ్లి చేసుకుని నీ దారి చూసుకోమని అంటుంది.

 

నా పెళ్లి గురించి ఆలోచించడానికి నువ్వెవరు.. ఈ సంబంధాలు తీసుకొచ్చింది ఎవరని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నేనే తీసుకొచ్చాను, వీళ్లంతా డబ్బున్నవాళ్లు, నువ్వు సరే అంటే తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పారు అంటుంది. దీంతో శివన్నారాయణ కల్పించుకుని.. దాని పెళ్లి గురించి నీకెందుకు బాధ, అది చూసుకోవడానికి దశరథ్, సుమిత్ర ఉన్నారు కదా అని అంటాడు. జ్యోత్స్న నా మనవరాలు అని పారు అనగానే.. అసలు నీకు జ్యోత్స్నకి సంబంధమే లేదు.. జాలి చూపించే హక్కు కూడా నీకు లేదని శివన్నారాయణ అంటాడు. దీంతో పారు శివాలెత్తిపోయి జ్యోత్స్న శివన్నారాయణ మనవరాలు కాదనే నిజం చెప్పబోతుండగా దాసు వచ్చి ఆపి తల్లిని పక్కకు తీసుకెళ్తాడు.

 

బయటకు తీసుకెళ్లిన తర్వాత దాసు ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఎవరు నా కూతురు.. జ్యోత్స్న నా కూతురు కాదమ్మా. నువ్వు సుమిత్ర కడుపున పుట్టకపోయి ఉంటే నీకీ పరిస్థితి వచ్చేది కాదు అని పెళ్లి పందిరిలో మాలిని అన్నప్పుడు కూడా జ్యోత్స్న తనను తాను కాపాడుకోలేదు. మా అమ్మ శత్రువులు నాకూ శత్రువులే అని వాళ్ల వైపే నిలబడింది. అలా ఎప్పుడైతే శివన్నారాయణ గారి కుటుంబం వైపు నిలబడిందో అప్పుడే జ్యోత్స్న సుమిత్ర, దశరథుల కూతురైపోయింది. జ్యోత్స్న దాసు, కళ్యాణిల కూతురు కాదు.. దశరథ్ సుమిత్రల కూతురే. ఈ మాట శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పి దాసు వెళ్లిపోతాడు.

 

మరోవైపు జ్యోత్స్న జాబ్ ను మాలిని పోగొట్టిస్తుంది. గతంలో మాలిని బెదిరించి లాగేసుకున్న రెస్టారెంట్ ఓనర్ ఇప్పుడు చిన్న కేఫ్ పెట్టుకున్నాడు. అక్కడే జ్యోత్స్న పని చేస్తోంది. మాలిని ఆ వ్యక్తిని పిలిచి.. జ్యోత్స్న నా మేనకోడలు, తనని వెంటనే తీసేయ్ లేదంటే నీ కేఫ్ కూడా ఉండదని బెదిరిస్తుంది. దీంతో ఓనర్ జ్యోత్స్నను.. ఇక జాబ్ కి రావొద్దని చెప్పేస్తాడు. జ్యోత్స్న బతిమాలినా వినడు. ఇదంతా సూరజ్ వల్లే జరిగిందని జ్యోత్స్న సూరజ్ మీద ఫైర్ అవుతుంది. ఇక ఆఫీస్ లో మాలిని సీఈఓ దీపకి క్యాబిన్ ఇవ్వకుండా బయట కూర్చోబెట్టి, చాలా ఫైల్స్ ఇచ్చి సాయంత్రంలోపు చదివి సంతకం పెట్టాలని, తేడా వస్తే నష్టం నువ్వే భరించాలని టార్గెట్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com