Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్నను చూసి షాక్ అయిన దక్షిణామూర్తి..శివన్నారాయణపై ఫైర్!

Sep 29, 2026 9:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 790 లో......కార్తీక్, దీప ఇద్దరికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేయొచ్చు కదా అని సూరజ్ మాలినితో అంటాడు. డబ్బు ఇస్తే వాళ్లు మన కళ్ల ముందే రెస్టారెంట్ పెట్టి మన శత్రువులను మనమే పెంచినట్టు అవుతుందని మాలిని వారిస్తుంది. ఇదిలా ఉండగా సూరజ్ కాఫీ కోసం జ్యోత్స్న పని చేస్తున్న కేఫ్ కి వెళ్తాడు. అక్కడ గతంలో జ్యోత్స్నను ఏడిపించిన ఆకతాయి మళ్లీ వచ్చి చేయి పట్టుకుని ఇబ్బంది పెడతాడు. జ్యోత్స్న కోపంగా కాకుండా.. సర్ జాబ్ చేసుకోవడానికి వచ్చాను, ఇబ్బంది పెట్టొద్దని బతిమాలుతుంది.

 

 ఇది చూసిన సూరజ్ కి కోపం వచ్చి వాడిని లాగిపెట్టి కొట్టాలని ఊహించుకుంటాడు. తను నా మరదలు, తనని ఏమైనా అంటే ఊరుకోనని అనాలని అనుకుంటాడు. కానీ అదంతా అతని భ్రమ మాత్రమే. నిజంలో జ్యోత్స్న బాధపడుతూ పక్కకు వెళ్తే, సూరజ్ వెళ్లి వాడు అలా మిస్ బిహేవ్ చేస్తుంటే ఇక్కడ పని చేయడం అవసరమా అని అడుగుతాడు. దానికి జ్యోత్స్న.. నా ఫ్యామిలీ కోసం తప్పదు సార్, మిస్ బిహేవ్ చేస్తేనే కొడతానంటున్నావ్, తాళి కట్టకుండా వెళ్లిపోయిన నిన్ను ఏమనాలి.. నా బాధ నీకు అర్థం కావాలంటే నా వైపు నుంచి ఆలోచించు.. మీ అమ్మ నీ చుట్టూ చిన్నప్పుడే బలమైన గోడ కట్టేసిందంటూ ఎమోషనల్ గా నిలదీస్తుంది. వీరిద్దరూ మాట్లాడుకోవడం మాలిని మనిషి వీడియో తీస్తాడు.

 

అదే సమయంలో అక్కడికి దక్షిణామూర్తి వస్తాడు. "మీరేంటి ఇక్కడ?" అని అడగ్గా, కాఫీ తాగడానికి వచ్చానని, జ్యోత్స్న ఇక్కడ పని చేస్తుందని సూరజ్ చెప్తాడు. దీంతో దక్షిణామూర్తి షాక్ అయి "ఏంటమ్మా ఇది" అని జ్యోత్స్నను అడుగుతాడు. మీరే మమ్మల్ని రోడ్డున పడేశారు, అనాథల్ని చేశారు, ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను పని చేస్తుంటే మళ్లీ సానుభూతి చూపిస్తున్నారంటూ జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. వెంటనే దక్షిణామూర్తి రోడ్డు మీద శివన్నారాయణను పట్టుకుని.. ఆడపిల్ల సంపాదన మీద బతుకుతావేంట్రా, నా మనవరాలిని కాఫీ షాప్ లో పని చేయిస్తావా అంటూ గొడవకు దిగుతాడు. 

 

 ఇంటికి వచ్చిన జ్యోత్స్నను శివన్నారాయణ, పారు నిలదీస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నావ్, ఉన్న పరువు కూడా పోయిందని అంటారు. దానికి జ్యోత్స్న.. అవును, నేను కేఫ్ లో 20 వేలకు పని చేస్తున్నా. ఒకప్పుడు 20 వేలు నా ఒక్క రోజు ఖర్చు, ఇప్పుడు నెల జీతం. మీరు సూరజ్ ఆలోచన నుంచి బయటకు రమ్మన్నారు కదా.. అందుకే రెండు నిర్ణయాలు తీసుకున్నా, ఒకటి సూరజ్ ని మర్చిపోవాలి.. రెండోది ఫ్యామిలీకి ఆర్థికంగా సాయం చేయాలని అంటుంది. మానేయ్ జ్యోత్స్న అని తాత అంటే..ఎందుకు మానేయాలి? మీ రెస్టారెంట్ లో పీఏగా పెట్టారు కదా, మోసాలు చేసే మీ మనవడి కంటే కేఫ్ లో పని చేయడం బెటర్ అని దక్షిణామూర్తి తాతకు చెప్పు అంటూ తెగేసి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 790, Star Maa Serial, Jyotsna, Suraj, Deepa, Karthik, Malini, Shivnarayana]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com