.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -800 లో... మాలిని దక్షిణామూర్తి, సుమిత్ర దగ్గరకు వచ్చి నువ్వు ఇలా కష్టపడటం నాకు ఇష్టం లేదమ్మా అంటాడు. దీంతో సుమిత్ర ఫైర్ అవుతుంది. ఏంటి నాన్న నేను కష్టపడినట్లు ఈ రోజు నువ్వు గుర్తించావా.. ఇన్ని రోజులు నిద్రపోయావా.. ఈ రోజే నిద్ర లేచావా.. నీ కూతురి జీవితంలో నువ్వే కష్టాలు తెచ్చావ్ నాన్న.. నా భర్తని చంపడానికి లారీ పంపింది మీరు కాదా.. మా ఆస్తుల మీద మా అధికారం లాగేసుకుంది మీరు కాదా.. ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది ఎవరు మీరు కాదా.. ఇవన్నీ మీరు ఇచ్చినవే కదా.. మీరు నాకు సారెగా కన్నీళ్లే ఇచ్చారు నాన్న అంటూ సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.
నువ్వు ఏదో ఒక రోజు ఇంటికి వస్తావని ఎదురు చూస్తున్నా వచ్చేయ్ అమ్మా.. నిన్ను ఇలా చూడలేకపోతున్నానని సుమిత్రను దక్షిణామూర్తి బతిమాలుతాడు. సుమిత్ర రాను అంటుంది. నీకు ఏం కావాలి అన్నా ఇస్తా అంటే ఆస్తులు ఇస్తావా అని సుమిత్ర అంటే ప్రాణం కూడా ఇస్తానని దక్షిణామూర్తి అంటాడు. దీంతో సుమిత్ర నువ్వు ఇంకా బతికే ఉన్నావా నాన్న.. ఒక్క సారి కాదు.. చాలాసార్లు చచ్చిపోయావ్.. నా పెళ్లి అప్పుడు తండ్రిగా చచ్చిపోయావ్.. నా కూతురి పెళ్లప్పుడు తాతగా చచ్చిపోయావ్.. మమ్మల్ని బయటకు లాగేసి మనిషిగా చచ్చిపోయావ్.. విలువ లేని నీ ప్రాణాలను నేను ఎలా అడుగుతా అంటూ కుప్పకూలిపోతుంది.
అప్పుడే అయిపోయింది అనుకున్నావా అని మాలిని అంటే ఇంకేం చేస్తావ్ చేసుకోమని సుమిత్ర అంటుంది. మాలిని దక్షిణామూర్తిని తీసుకెళ్లిపోతుంది. సూరజ్ దగ్గరకు కార్తీక్ వెళ్లి మీ అమ్మకి నువ్వు అయినా చెప్పొచ్చు కదా గొడవలు వద్దని అంటాడు. గొడవలు మా తాత వల్ల కాదు మీ తాత వల్ల అని సూరజ్ అంటాడు. ఆ దౌర్భాగ్యుడు శివన్నారాయణ నా కూతుర్ని రోడ్డు మీద షాప్‌లో పనిమనిషిని చేశాడు.. నా కూతురి చేతే నన్ను తిట్టించాడు.. ఇంత కంటే భరించడం నాకు రాదని దక్షిణామూర్తి అంటాడు. అమ్మ మాలిని నా కూతురు.. నా మనవరాలు నా ఇంటికి రావాలి.. నువ్వేం చేస్తావో చెయ్ అని అంటాడు. ఇక చాలు తాత జరిగింది చాలు.. మనం వాళ్ల మీద పగ తీర్చుకున్నాం.. ఎంత అవమానించాలో అవమానించాం.. ఇక ఇబ్బంది పెట్టొద్దని సూరజ్ తల్లి మీద అరుస్తాడు.
చివర్లో మాలిని తన ప్లాన్ అమలు చేస్తుంది. శివన్నారాయణ టిఫిన్ కొట్టు ముందు మరో టిఫిన్ కొట్టు పెట్టించి ప్లేట్ 20 రూపాయలకే అమ్మిస్తుంది. దాంతో శివన్నారాయణ షాప్‌కి ఎవరూ రారు. వ్యాపారం పోయిందని శివన్నారాయణ కుప్పకూలిపోతాడు. ఇది మాలిని పిన్ని పనే అని కార్తీక్ అంటాడు. మాలిని శివన్నారాయణని దెబ్బ తీశానని పొంగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
