Home

»

Tv News

శివన్నారాయణ టిఫిన్ సెంటర్.. కన్నీరు పెట్టుకున్న కార్తీక్!

Oct 9, 2026 10:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -799 లో... సూరజ్ పర్స్ చెక్ చేస్తుంది‌ మాలిని. జ్యోత్స్న ఫొటో కనిపించకపోవడంతో సూరజ్ నా కొడుకు అని అనుకుంటుంది. తర్వాత సూరజ్ దిండు కింద జ్యోత్స్న ఫొటో చూసి షాక్ అయిపోతుంది. జ్యోత్స్న చెప్పింది నిజమే నా కొడుకు మనసులో జ్యోత్స్న ఉంది అనుకొని తన మనిషిని పిలిచి జ్యోత్స్న ఎవరికీ కనిపించకూడదని అంటుంది. మీకే కనిపించకూడదా.. ఎప్పటికీ ఎవరికీ కనిపించకూడదా అని అతను మాలినిని అడుగుతాడు.. మాలిని ఒక్క లుక్ ఇస్తుంది. ఇక శివన్నారాయణ అలసిపోయి కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటే కార్తీక్ కొబ్బరి నూనెతో మర్దనా చేస్తాడు. తాత పరిస్థితికి కార్తీక్ కన్నీరు పెట్టుకుంటాడు.

సూరజ్ జ్యోత్స్నకి కాల్ చేస్తాడు. జ్యోత్స్న ఫోన్ కలవదు. సూరజ్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్ లు పంపిస్తూనే ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చిరాకు అయిపోతాడు. నువ్వు పీఏగా పనికి రావు, ఆఫీస్ కి రావడం మానేయ్ అని అనేస్తాడు. ఇంతలో దక్షిణామూర్తి వచ్చి ఏమైందిరా ఎందుకు అంతలా చిరాకుపడుతున్నావని అంటే జ్యోత్స్న పీఏగా పనికిరాదు తాత, తనకి పొగరు అంటాడు. దాని రక్తంలోనే అది ఉందిరా అని పెద్దాయన అంటారు. అయితే భార్యని చేసుకో.. జ్యోత్స్న నిన్ను ప్రేమిస్తుంది.. నువ్వు ప్రేమిస్తున్నావ్ రా.. నీ మనసులో దాని మీద ప్రేమ ఉందిరా అని తాత సూరజ్ కి చెప్తాడు.

మరోవైపు శివన్నారాయణ టిఫిన్ కొట్టు దగ్గర దశరథ్ తండ్రికి సాయం చేస్తుంటే సుమిత్ర అంట్లు తోముతుంది. మీరు ఇలా పని చేయడం నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటే ఇలా అయినా సాయం చేయనివ్వండి అని అంటారు. కార్తీక్, దీప ఇద్దరు దూరం నుంచి చూస్తూ కన్నీరు పెట్టుకుంటారు. నా పుట్టింటికి మాలిని అత్త ఏ గతి పట్టించిందని దీప అంటుంది. ఇంతలో దక్షిణామూర్తిని మాలిని, సూరజ్ అక్కడికి తీసుకొస్తారు. చూడండి మామయ్య ఆ శివన్నారాయణ మీ కూతురికి ఏ గతి పట్టించాడో అని మాలిని అంటుంది.

దక్షిణామూర్తి సుమిత్ర దగ్గరకు వెళ్లి నిల్చుంటే సుమిత్ర భర్తతో కస్టమర్ వచ్చారు.. ఏం కావాలో చూడు అంటుంది. వాళ్లు మన టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తినరులే అమ్మా అని శివన్నారాయణ అంటాడు. దక్షిణామూర్తి అరిస్తే కార్తీక్, దీప ఇద్దరు వచ్చి గొడవ వద్దు అంటారు. అందరిని చూసిన శివన్నారాయణ అడ్డమైన చెత్త అంతా నా టిఫిన్ బండి దగ్గరే ఉంది అని అంటాడు. ఏంటమ్మా ఇది నిన్ను ఎంత అపురూపంగా పెంచుకున్నా కదమ్మా, నీ ఎంగిలి ప్లేట్ ఎప్పుడూ నీతో కడగనివ్వలేదు కదమ్మా ఇలాంటి నీతో ఎంగిలి ప్లేట్లు కడిగించాడు ఈ దుర్మార్గుడు అని దక్షిణామూర్తి అంటే శివన్నారాయణ కొట్టడానికి గరిటె తీస్తాడు. ఇంటి కోడలితో ఎంగిలి ప్లేట్లు కడిగిస్తున్నారు.. అమ్మ సుమిత్ర నువ్వు మాతో వచ్చేయ్ అమ్మా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com