Home

»

Tv News

జ్యోత్స్న జాబ్ గురించి సుమిత్రకు చెప్పబోయిన మాలిని.. అడ్డుకున్న సూరజ్!

Oct 8, 2026 11:02AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -798 లో... కార్తీక్, దీప శివన్నారాయణ టిఫిన్ కొట్టులో టిఫిన్ తిని బిల్లు కట్టకుండా డబ్బులు లేవని అంటారు. పర్లేదు వెళ్లిపోండి అని పెద్దాయన అంటే మేం ఫ్రీగా తినం, పని చేసి అప్పు తీర్చేస్తామని ఇద్దరూ పెద్దాయనకు సాయం చేస్తారు. మరోవైపు సుమిత్ర దగ్గరకు మాలిని వెళ్లి జ్యోత్స్న పీఏగా చేరిందన్న విషయం చెప్తానని అంటే దక్షిణామూర్తి ఆపుతాడు. నువ్వు చెప్తే నా మనవరాలిని అక్కడికి పంపరు.. నువ్వు చెప్తే శివన్నారాయణ నా మనవరాలిని ఆపేస్తాడని దక్షిణామూర్తి వార్నింగ్ ఇస్తాడు.

నువ్వేం మాట్లాడవేంట్రా అని సూరజ్ ని మాలిని అడిగితే తాత కరెక్ట్ గా చెప్పాడని సూరజ్ అనడంతో మాలిని షాక్ అవుతుంది. మరోవైపు సుమిత్ర జ్యోత్స్న గురించి టెన్షన్ పడుతుంటే దీప ఏమైందని అడుగుతుంది. జ్యోత్స్న ఇంకా రాలేదేంటని సుమిత్ర అడిగితే మా కంటే ముందే వచ్చేసిందే అని దీప నోరు జారతుంది. ఇంతలో దశరథ్ వచ్చి నీకు ఎలా తెలుసు.. నీ కంటే ముందు వచ్చేసింది అన్నావ్ ఏంటని ప్రశ్నించడంతో దీప తడబడుతుంది. అందరు ప్రశ్నించడంతో కార్తీక్ కవర్ చేస్తాడు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారేంటని ఇంట్లో వాళ్లకు డౌట్ వస్తుంది.

మాలిని సుమిత్ర కోసం కాంచనకు కాల్ చేయడం.. ఆ ఫోన్ సుమిత్ర లిఫ్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. నువ్వు చేయలేనివి నీ కూతురు ద్వారా చేస్తున్నావా.. ముందు కార్తీక్ దీపల్ని ఇప్పుడు నీ కూతుర్ని మా మీదకి పంపావ్ అని చెప్పి.. జ్యోత్స్న కూడా మా దగ్గరే పని చేస్తుందని చెప్పేలోపు సూరజ్ వచ్చి మాలిని ఫోన్ లాక్కొని కాల్ కట్ చేస్తాడు. ఎందుకు ఫోన్ లాక్కున్నావని మాలిని అడిగితే తప్పు చేస్తున్నావ్ అమ్మా.. ఇప్పటికే ఒక తప్పు చేశావ్ మరోసారి తప్పు చేయొద్దు.. జ్యోత్స్నని నా దగ్గర పీఏగా చేసింది నువ్వే.. కేఫ్ లో జ్యోత్స్న జాబ్ పోవడానికి కారణం నువ్వే కానీ నాకు చెప్పలేదని సూరజ్ నిలదీస్తాడు.

అవునురా మీ తాత మనవరాలు కేఫ్ లో పని చేయడం నాకు ఇష్టం లేదని మాలిని అంటే ఇక ఆపమ్మా, అయినా తాత అత్తకి చెప్పొద్దంటే ఎందుకు చెప్తున్నావ్, జ్యోత్స్నని ఎక్కడా జాబ్ రాకుండా చేశావ్ ఇప్పుడు అది నీ నెత్తి మీదకే వచ్చిందని సూరజ్ అంటాడు. నా కొడుకు మారిపోయాడని మాలిని అనుకుంటుంది. చివరగా కార్తీక్ వాళ్లని సుమిత్ర పిలిచి ఆఫీస్ లో ఏదో జరిగిందిరా, ఏమైందో చెప్పండి అని అడుగుతుంది. అందరూ జ్యోత్స్నకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. కార్తీక్ ఫోన్ కి జ్యోత్స్న కాల్ వస్తుంది.. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా రేపు రాత్రికి వస్తా, జాబ్ వచ్చిందని చెప్పి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com