Home

»

Tv News

 PA అంటే ప్రేమించిన అమ్మాయి అత్త.. మాలినికి జ్యోత్స్న మాస్ షాక్!

Oct 7, 2026 10:46AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -797 లో......జ్యోత్స్న మాలిని దగ్గరకు వెళ్లి ఈ ఆఫీస్ లో నన్ను అడుగు పెట్టనివ్వనన్నావ్.. ఇప్పుడు ఈ ఆఫీస్ నిండా నా అడుగులే ఉంటాయంటూ సవాల్ చేస్తుంది. దీనికి మాలిని ఆఫ్ట్రాల్ నువ్వు నా కొడుకు దగ్గర PA వి, వాడేం చెప్పినా ఎస్ బాస్ అనాలి అంటుంది. అప్పుడు జ్యోత్స్న అత్తా నీకు ఇంకా నా భాష తెలీదు.. PA అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, ప్రేమించిన అమ్మాయి, సూరజ్ PA అంటే సూరజ్ ప్రేమించిన అమ్మాయి అంటూ మాలినికి షాక్ ఇస్తుంది. నీ కొడుకు దగ్గరకు వెళ్లాలన్నా నా పర్మిషన్ కావాలంటూ రెచ్చగొడుతుంది.

నువ్వు నా జాబ్ తీయించావ్.. మీ ఆఫీస్ లో జాబ్ ఇవ్వలేదు.. ఇప్పుడు నీ కొడుకు పక్కనే చేరా.. ఏం చేస్తావ్ అత్తా అంటూ జ్యోత్స్న నిలదీస్తుంది. మనుషుల్ని వస్తువులా చూస్తా అన్నావ్ కదా.. నేను కూడా నిన్ను వస్తువులానే చూస్తా.. వస్తువుతో ఆడుకున్నట్లే ఆడుకుంటా  అని చెప్పేసి వెళ్లిపోతుంది. బయటకు రాగానే దీప, కార్తీక్ లు జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్లి ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యావ్.. ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది అంటారు. దీనికి జ్యోత్స్న మన ఫ్యామిలీ కోసం మీకు లక్ష్యం ఉన్నట్లే నాకూ ఉంది.. మీరు మాలిని అత్త ద్వారా ఆఫీస్ కి వచ్చారు.. నేను దక్షిణామూర్తి తాత ద్వారా వచ్చాను‌. మీ దారికి నేను అడ్డురాను. నా దారికి మీరు అడ్డురావొద్దు.. ఇన్ని రోజులు మనతో వీళ్లు ఆడుకున్నారు.. ఇప్పుడు మనం వీళ్లతో ఆడుకుందామని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత సూరజ్ వచ్చి మొత్తానికి రికమండేషన్ తో వచ్చేశావని అంటాడు. దీనికి జ్యోత్స్న నువ్వు సంతకం పెట్టావ్ కదా అంటే మా అమ్మ చెప్పింది కాబట్టి పెట్టా..‌ఇది మా తాత నిర్ణయం అంతే కానీ నేను అంగీకరించానని అనుకోకు అంటాడు సూరజ్. నీ వల్ల కేఫ్ లో నా జాబ్ పోయింది.. నీ అమ్మ నీ గురించి భయపడుతోంది.. నేను బ్రైన్ తో ఆలోచించేంత కాలం శివంగిలా తిరిగా..‌ నిన్ను మనసులోకి తీసుకున్నాక బ్రైన్ పని చేయడం మానేసిందంటూ జ్యోత్స్న ఎమోషనల్ గా చెప్తుంది. మరోవైపు దీప, కార్తీక్ లను మాలిని కలిసి ఇదంతా మీ స్కెచ్ ఆ..‌ఫ్యామిలీ అంతా కలిసి ప్లాన్ చేశారా అని నిలదీస్తుంది.

నీ కొడుకుతో నా చెల్లెల్ని ఎగరేసుకుపోవాలని ప్లాన్ చేశాం.. నీ ఆఫీస్ లో నీ ముందే వాళ్లకి పెళ్లి చేయాలని అనుకుంటున్నామని  దీప అంటుంది. జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడు.. సూరజ్ మనసులో జ్యోత్స్న ఉందని దీప అనగానే మాలిని రగిలిపోతుంది. భర్త జోలికి వస్తేనే ఇంత చేస్తే, నా కొడుకు జోలికి వస్తే ఆ మనసు ఉండదు.. ఆ మనిషి ఉండదు.. చంపేస్తా అంటూ మాలిని వార్నింగ్ ఇస్తుంది. చివరగా దీప, కార్తీక్ లు శివన్నారాయణ టిఫిన్ షాప్ కి వెళ్లి సాయం చేయబోతే వద్దనడంతో టిఫిన్ కావాలని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com