Home

»

Tv News

 మాలినికి చెక్ పెట్టిన దక్షిణామూర్తి.. ఆఫీస్ లోనే జ్యోత్స్న హల్చల్!

Oct 6, 2026 12:47PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -796 లో....మాలిని దక్షిణామూర్తిని పక్కకు తీసుకెళ్లి జ్యోత్స్నకి ఎందుకు PA గా అపాయింట్మెంట్ ఇచ్చారని నిలదీస్తుంది. దానికి తాత అసలు విషయం చెప్తాడు. కేఫ్ లో పని చేస్తున్న జ్యోత్స్నని ఉద్యోగం నుండి తీయించింది.. ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేయించింది నువ్వే కదా అని మాలినిని అడుగుతాడు.జ్యోత్స్న తనను కలిసిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. జ్యోత్స్న దక్షిణామూర్తి దగ్గరకు వచ్చి మాలిని కేఫ్ లో తీసేసిన విషయం.. సూరజ్ రిజెక్ట్ చేసిన విషయం చెప్పిందని అంటాడు. తను ఉద్యోగం అడగడం లేదు, వద్దనడానికి రీజన్ అడుగుతున్నానని జ్యోత్స్న అందని చెప్తాడు. బయట మీ కోడలు చాలా వెటకారంగా మాట్లాడిందని, మా జీవితాలు అంటే మీకు అంత వెటకారమా, మమ్మల్ని బతకనివ్వరా అని జ్యోత్స్న ప్రశ్నించిందని తాత చెప్తాడు. అసలు మా అమ్మ.. నీ కన్న కూతురా, పెంచుకున్న కూతురా అని కూడా జ్యోత్స్న నిలదీసిందని అంటాడు.

దక్షిణామూర్తి మాలినితో జ్యోత్స్న ఆ శివన్నారాయణకే మనవరాలు కాదు.. నాకు మనవరాలే అని తెగేసి చెప్తాడు. ఇలా ఇక్కడే జ్యోత్స్న ఉంటే నన్ను ఇంకా అర్థం చేసుకుంటుంది.. నా కూతురు నా ఇంటికి వస్తుందని అంటాడు. ఇది మనకు వచ్చిన మంచి అవకాశం.. నా కూతురు, మనవరాలు నన్ను అర్థం చేసుకుంటే నేను ఆ శివన్నారాయణ మీద గెలిచినట్లే అని అంటాడు. నేను నీకు పర్మిషన్ అడగడం లేదు.. చెప్పింది చేయమన్నానని మాలినికి వార్నింగ్ ఇస్తాడు. నాకు నా కొడుకు ఎంతో కూతురు అంతే..‌మనవడు ఎంతో మనవరాలు అంతే అని అంటాడు. ఆ తర్వాత సూరజ్, జ్యోత్స్న మధ్య గొడవ జరుగుతుంది. మా తాత నిన్ను ఎలా PA గా పెట్టాడు.. మాలో మాకే గొడవలు పెట్టడానికి వచ్చావా అని సూరజ్ అంటే.. అన్నీ మీ తాతనే అడుగు.. నువ్వు మాకు పెట్టావ్ కదా అని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. సిటీలో ఇన్ని రెస్టారెంట్స్ ఉంటే ఇక్కడే ఎందుకు రావాలని సూరజ్ అంటాడు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది.

ఇదంతా చూసిన కార్తీక్, దీప ఇద్దరు  ఇదంతా మనమే చేశామని.. మనమే జ్యోత్స్నని PA గా పెట్టామని అనుకుంటారు. మాలిని పిన్ని అన్నీ సవ్యంగా జరగనిస్తుందా.. ఎక్కడ జ్యోత్స్న సూరజ్ కి దగ్గరైపోతుందని తరిమేయదు కదా.. సంతకం పెట్టకుండా ఆపేస్తుందేమోనని కార్తీక్ అంటాడు. ఇది జ్యోత్స్న సమస్య, తన పోరాటం తనే చూసుకుంటుందని అంటాడు. చివరకు దక్షిణామూర్తి స్టాఫ్ అందరిని పిలిచి జ్యోత్స్న నా మనవరాలు.. నా కూతురి కూతురు.. ఈ రోజు నుండి మన చైర్మన్ సూరజ్ కి పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటుందని ప్రకటిస్తాడు. సూరజ్ మా తాత మాటే నా మాట అని మాలినికి షాక్ ఇచ్చి సంతకం పెట్టడానికి రెడీ అవుతాడు. అప్పుడు జ్యోత్స్న ఆపి నేను రికమండేషన్ తో జాబ్ తెచ్చుకున్నా అనుకుంటారని అంటుంది. దానికి తాత నీకు PA పోస్ట్ కంటే ఎక్కువ అర్హత ఉందని జ్యోత్స్నకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు చెప్పాలని తనని అవమానించినా నన్ను చేసినట్లే అని చెప్పి ఆఫర్ లెటర్ ఇస్తాడు. చివర్లో జ్యోత్స్న మాలిని దగ్గరకు వచ్చి నాకు ఎక్కడా ఉద్యోగం రానివ్వను అన్నావ్ కదా..‌ఇక నుండి ఈ ఆఫీస్ లో నా అడుగులే ఉంటాయని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com