.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -818 లో....నారాయణ టిఫిన్ బండి దగ్గర దీప గిన్నెలు కడుగుతుంటుంది .అది చూసిన జ్యోత్స్న.. తనే ఆ పని చేస్తానంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ వి, కింద కూర్చుని గిన్నెలు కడగాలంటే ఇబ్బంది అవుతుందని జ్యోత్స్న పని చేపడుతుంది. నీకు చేతకాదు జ్యోత్స్న అని దీప అంటే, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుందని జ్యోత్స్న గిన్నెలు తోముతుంది. అది చూసిన కార్తీక్.. జ్యోత్స్న మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పాల్గొన్న రోజులను గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర జ్యోత్స్నను చూసి షాక్ అవుతుంది, కానీ దశరథ్ పని చేయమంటాడు.
మోసం చేసిన సూరజ్‌ను నేనేమైనా చేయగలిగానా అని శివనారాయణ అంటుండగానే సూరజ్ కార్లో వస్తాడు. అదే కార్లో పారిజాతం కూడా ఉంటుంది. హే జ్యోత్స్న గిన్నెలు కడగడం ఆపి దగ్గరకు రా అని సూరజ్ పిలవడంతో శివనారాయణకు పిచ్చి కోపం వస్తుంది. కర్ర పట్టుకుని కొట్టడానికి వెళ్తాడు. అయితే కార్లో వెనుకాల ఉన్న పారును చూసి అందరు కంగారుపడతారు. కారు కింద పడితే తీసుకొచ్చానని సూరజ్ చెప్తాడు. నేను మిమ్మల్ని చూసి బ్రేక్ వేశా, మీరే బానెట్‌ను గుద్దుకుని పడిపోయారని సూరజ్ అనడంతో పారుకు ఫ్యూజులు ఔట్ అవుతాయి. దేవుడిలా కాపాడావని పారు అంటే, దేవుళ్లే కాదు దెయ్యాలు కూడా కాపాడుతాయని శివనారాయణ కౌంటర్ వేస్తాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన ఓ కుర్రాడు జ్యోత్స్నను చూసి.. ఆమె మిస్ హైదరాబాద్ కదా అనుకుంటాడు. ఆమె గిన్నెలు కడగడాన్ని సోషల్ మీడియాలో పెడితే లైక్‌లు వస్తాయని సీక్రెట్‌గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాడు. రాత్రి ఇంట్లో ఈ వీడియో చూసి సూరజ్ షాక్ అవుతాడు. ఆ వీడియోను దక్షిణామూర్తి చూసి సోఫాలో కూలబడిపోతాడు. జ్యోత్స్న నీ మరదలు అని నీకు తెలుసు కదా, నా మనవరాలికి ఇదేం కర్మరా, నువ్వే పాపం చేశావ్, నువ్వే దాని తలరాత మార్చేశావ్, మూడు ముళ్లు పడకపోవడం వల్ల నా మనవరాలి జీవితం నాశనమైపోయిందని దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతూ లోపలికి వెళ్లిపోతాడు.
జ్యోత్స్న గిన్నెలు కడుతున్న ఫొటోను ఆమెకే సూరజ్ పంపిస్తాడు. శౌర్య వచ్చి ఫోన్ ఇవ్వమంటే ఇవ్వదు.. ఇద్దరు ఫోన్ లాక్కుంటుండగా లవ్ సింబల్ రిప్లైగా వెళ్తుంది. అది చూసి సూరజ్ తల పట్టుకుంటాడు, జ్యోత్స్న వెంటనే డిలీట్ చేస్తుంది. కావాలని ఫొటోలు తీయించుకుని వైరల్ అవుతున్నావా అని సూరజ్ అడుగుతాడు. మార్నింగ్ మన ప్లేస్‌లో కలుద్దామని అడగ్గా, రాకాసి రాశి, పిశాచి నక్షత్రం అని జ్యోత్స్న సెటైర్ వేస్తుంది. మరోవైపు సుమిత్ర కాళ్ల నొప్పులకు దశరథ్ నూనె రాస్తాడు. నువ్వు పేదరికంలో మగ్గడం నాకు ఇష్టం లేదు, నీ పుట్టింటికి నువ్వు, జ్యోత్స్న వెళ్లిపోవచ్చు కదా అని దశరథ్ అడగ్గా.. రాముడి కోసం అడవికి వెళ్లిన సీత కథను సుమిత్ర చెప్పి, పెళ్లి కోసం డబ్బులు దాచాలని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
