స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -793 లో..... శివన్నారాయణ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే బాగా ఆకలి వేయడంతో ఓ టిఫిన్ బండి దగ్గర ఆగుతాడు. తన దగ్గర ఉన్న డబ్బులకు టిఫిన్ వస్తుందని ఇడ్లీ తీసుకుంటాడు. తిన్న తర్వాత.. చల్లగా ఉంది, కారం ఉందని క్వాలిటీ బాలేదని అనడంతో ఆ వ్యాపారి ఫైర్ అవుతాడు. నీకు ఇష్టం ఉంటే తిను లేకపోతే మానేయ్ అని శివన్నారాయణని తిడతాడు. నీకు చేతనైతే నా బండి ఇస్తా, ఒక్క నెల రోజులు టిఫిన్ అమ్ము, ఎంత క్వాలిటీ ఇస్తావో చూస్తా, నాకు నెలకి 20 శాతం ఇవ్వు చాలు అని ఛాలెంజ్ చేస్తాడు. శివన్నారాయణ ఛాలెంజ్ కి ఓకే అంటాడు. అదే సమయంలో అక్కడికి కార్తీక్ వచ్చి.. తాత జేబు ఖాళీ అవ్వడంతో తిన్న ప్లేట్ కి డబ్బు కడతాడు. తాత ఇలాంటి ఛాలెంజ్ కి ఓకే అన్నాడేంటని ఆలోచిస్తాడు.
మరోవైపు జ్యోత్స్న ఎండలో కొంగు కప్పుకుని రోడ్డు మీద జాబ్ కోసం తిరుగుతుంటే మాలిని ఎదురవుతుంది. శివన్నారాయణ గారి మనవరాలు ఏంటి ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతోందని వెటకారంగా అడుగుతుంది. మీ కొడుకు చేసిన పనికి అని జ్యోత్స్న అంటే వాడేం చేశాడని మాలిని అడుగుతుంది. నా జాబ్ తీయించేశాడని జ్యోత్స్న చెప్పగానే జాబ్ తీయించింది వాడు కాదు నేనే అని మాలిని షాక్ ఇస్తుంది. మరో జాబ్ కోసం తిరుగుతున్నావ్ కదా, నీకు ఏ జాబ్ దొరకదు.. దొరికినా నేను ఉండనివ్వనని మాలిని వార్నింగ్ ఇస్తుంది. నిన్ను మీ బావ, అక్క పోషిస్తారులే, వాళ్ల జీతం ఎంతో తెలుసా వంద పైసలు అంటే రూపాయి అని అవమానిస్తుంది.
దీంతో జ్యోత్స్న ఊగిపోతుంది. నీకు మా అమ్మ అంటే పగ.. అందుకే అది నా మీద చూపిస్తున్నావ్.. అదృష్టం నీ బాడీగార్డ్ కాదు ఎప్పుడూ నీ వెనక ఉండటానికి.. నాకు టైం వస్తుంది.. అప్పుడు నువ్వు నా ముందు నిలబడటానికి భయపడతావ్.. నన్ను ఏడిపిస్తే నీకు సంతోషం వస్తుందేమో నాకు కసి పెరుగుతుంది.. నన్ను ఎక్కడా నిలబడనీయకుండా చేస్తా అంటున్నావ్ కదా.. అలా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నీ నెత్తి మీద నిలబడతాను.. నేను ఒత్తి వెలిగించిన బాంబ్ లాంటి దాన్ని.. వదలకుండా పట్టుకుంటే చేతిలోనే పేలిపోతానని వార్నింగ్ ఇస్తుంది. నీ కొడుకుని కొట్టినందుకు నాకు చేయి లేకుండా చేస్తా అన్నావ్ కదా.. ఆ పరిస్థితి నీకు వస్తుందేమో చూసుకోమని మాలినితో జ్యోత్స్న తెగేసి చెప్తుంది.
ఇంటికి వచ్చిన శివన్నారాయణ పారిజాతంతో.. నేను టిఫిన్ బండి పెట్టాలి అనుకున్నా.. నువ్వు నాకు సాయంగా ఉండాలని అంటాడు. దీంతో పారిజాతం.. ఏవండీ అని పెద్దగా అరుస్తుంది. అందరు అక్కడికి వస్తారు. టిఫిన్ బండి పెడితే తప్పేంటి, మన పేరు ప్రఖ్యాతలు పోయాయి.. ఇప్పుడు జీవితం మొదటి నుంచి మొదలు పెట్టానని శివన్నారాయణ తన నిర్ణయం చెప్పేస్తాడు. దశరథ్ వాళ్లు అడ్డుకోవాలని చూసినా.. నేను నిర్ణయం తీసుకున్నా, ఎవరూ అవసరం లేదు నాకు తోడు పారిజాతం ఉంటే చాలు అని అంటాడు. ఓరినీ దుంపతెగ, మళ్లీ నన్ను పనిదాన్ని చేశావ్ కదరా అని పారిజాతం మనసులో అనుకుంటుంది. ఇక జ్యోత్స్న.. నన్ను జాబ్ లో తీయించింది ఎవరో తెలిసింది, అది మీ అమ్మే అని సూరజ్ కి జ్యోత్స్న మెసేజ్ చేస్తుంది. సూరజ్ షాక్ అయ్యి మాలినిని ఇన్ డైరెక్ట్ గా నిలదీస్తాడు. మరుసటి రోజు ఇంటర్వ్యూల్లో జ్యోత్స్న ఫైల్ సూరజ్ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam2 Today Episode October 1st, Karthika Deepam 2 Serial, Malini Jyotsna Fight, Siva Narayana Tiffin Bandi Challenge]





