స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -808 లో....ఇన్ని రోజులు ఏమైపోయావ్ జ్యోత్స్న, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా.. ఎక్కడికి వెళ్లావ్.. ఎందుకు వెళ్లావని జ్యోను ఇంట్లో వాళ్లంతా నిలదీస్తారు. నేను తిరిగొచ్చినందుకు మీకు ఆనందంగా లేదా అని జ్యోత్స్న తిరిగి ప్రశ్నిస్తుంది. ఎవరో యాక్సిడెంట్ లో చనిపోయారని, అది నువ్వే అనుకొని కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే విని తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని సుమిత్ర ఏడ్చేస్తుంది. దీప ఉంది కదా మమ్మీ అంటే నేను ప్రాణం పోసింది నీకే, నీకు ఏమైనా అయితే నేను బతకలేనని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.
మరోవైపు అసలు ట్విస్ట్ బయటపడుతుంది. జ్యోత్స్నను కిడ్నాప్ చేయించింది మాలిని అని తెలుస్తుంది. చివరి నిమిషంలో ఎందుకు జ్యోత్స్నను వదిలేయమన్నారు మేడమ్ అని బాడీగార్డు విజయ్ అడగ్గా, మాలిని షాకింగ్ సమాధానమిస్తుంది. జ్యోత్స్న కళ్ల ముందు లేకుంటే సూరజ్ మారిపోతాడనుకున్నాను కానీ జ్యోత్స్న కనిపించని దగ్గరి నుంచి సూరజ్ లో చూసిన మార్పుకు భయం వేసిందని చెప్తుంది. ఒకవేళ జ్యోత్స్న రాకపోతే నా కొడుకు పూర్తిగా జ్యోత్స్న ప్రేమికుడిగా మారిపోతాడేమోనని వదిలేశానని అంటుంది. ఇప్పుడు చేయాల్సింది మనిషిని చంపడం కాదు, మనసును చంపడమని సైకో ప్లాన్ వేస్తుంది.
ఇటు కార్తీక్, దీపతో జ్యోత్స్న మాట్లాడుతూ మాలిని అత్త గెలిచింది.. నేను సూరజ్ పీఏగా చేరానని మనవాళ్లకు తెలిసేలా చేసిందని చెప్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా మాలిని ఇంటికే వెళ్లి షాక్ ఇస్తుంది. మాలిని కాళ్ల మీద సూరజ్ పడి క్షమించమ్మా అని అంటుండగా జ్యోత్స్న లోపలికి రావడంతో మాలిని ఫ్యూజులు ఔట్ అవుతాయి. నా మీద చేయి ఎందుకు ఎత్తావు.. నా మీద నీకు ఏ అధికారం ఉందని జ్యోత్స్న సూటిగా సూరజ్ ని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam2 Today Episode October 19th, Karthika Deepam 2 Serial Today, Jyotsna Kidnap Truth Malini Plan, Jyotsna Direct Entry Malini House]




