స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ స కార్తీక దీపం 2 (Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 807 లో.....జ్యోత్స్న మాలిని దగ్గరకు వెళ్లి షాకింగ్ ఆరోపణలు చేస్తుంది. ఒంటిమీద ఒక్క గీత పెట్టకుండా ఇంత సేఫ్ గా ఎలా పంపించావ్ అత్తా అని అడుగుతుంది. ఎవరో వచ్చి నన్ను తీసుకుపోయి ఎక్కడో దాచారని రాత్రి తీసుకొచ్చి నడిరోడ్డులో కళ్లకు గంతలు కట్టి వదిలేశారని చెప్తుంది. కంటికి కనిపించకపోయినా జరిగిందంతా చేయించింది నువ్వే అని నాకు తెలియదనుకున్నావా అని నిలదీస్తుంది. నీ కొడుకు నిన్ను అనుమానించడం భరించలేక, వాడు వెతకడం తట్టుకోలేకే భయపడి వదిలేశావని అంటుంది. నన్ను లేకుండా చేయాల్సిన అవసరం నీకు తప్ప ఎవరికీ లేదని, నాకు ఏదైనా అయితే దానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ ఫొటోకి నీ కొడుకే దండేస్తాడని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
ఈ మాటలకు మాలిని షాక్ అవుతూ ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నావని అడుగుతుంది. కొన్నింటికి ఆధారాలు ఉండవు.. నువ్వు నన్ను భయంతోనే వదిలేశావని జ్యోత్స్న అంటుంది. నేను చేయి ఎత్తితే ఎవరు ఆపలేరని మాలిని అనగా నీ కొడుకు చేయి ఎత్తింది ప్రేమతో అని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. నీ చేతికి మట్టి అంటకుండా చేస్తావ్ అత్త, కానీ నేను నీ చేతులకు బురద అంటిస్తానని..నువ్వు చేసింది నీ కొడుక్కు నీ చేతులే చెప్తాయని ఛాలెంజ్ చేస్తుంది. నేను మొండిదాన్ని, నన్నేం చేయలేవని, నీ కొడుకును నీకు దూరం చేస్తానని, వాడి నీడను కూడా నీకు దూరం చేస్తానని తెగేసి చెప్తుంది. తను సూరజ్ ప్రేమించిన అమ్మాయినని, పనివాళ్ల మీద కాదు నీ పని పట్టేదాన్ని అత్త అని ధైర్యంగా ఎదురుగా వచ్చి ఢీకొట్టమని సవాల్ విసురుతుంది.
ఇంతలో సూరజ్ రావడంతో మాలిని ఆగిపోతుంది. జ్యోత్స్న చేయిని సూరజ్ పట్టుకుని కార్తీక్ ఇంటికి లాక్కుని వస్తాడు. గత నాలుగు రోజులుగా జ్యోత్స్న కనిపించకుండా పోతే మా మీద నిందలు వేసి పోలీసులను తీసుకొచ్చారని సూరజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీనికి కార్తీక్ కౌంటర్ ఇస్తూ జ్యోత్స్నకి ఏం కాకుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చేది.. ఆఫీస్ కి తీసుకెళ్లి వీడియో కాల్ చేయించేవాడివి కాదని అంటాడు. జ్యోత్స్నను మాయం చేసింది మీ అమ్మే, నువ్వు మీ అమ్మకు దూరమైపోతావని భయపడి వదిలేసిందని కార్తీక్ అనడంతో సూరజ్ వర్సెస్ కార్తీక్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. ఒకప్పుడు జ్యోత్స్న ప్రేమించింది మీ ఆయన్నే కదా వదినా అని దీపను సూరజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. చివరకు దక్షిణామూర్తి తాతను తీసుకుని సూరజ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam2 Today Episode October 17th, Karthika Deepam2 Serial Star Maa, Jyothsna Malini Challenge, Suraj Karthik Argument]




