Home

»

Tv News

Karthika Deepam2 Today Episode October 16th, Karthika Deepam 2 Serial 806, Jyothsna Suraj Fight, Malini Shock

Oct 17, 2026 9:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2' (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ - 806 లో..... గుమ్మం దగ్గర తండ్రిని చూడగానే సుమిత్ర సీరియస్ అవుతుంది. నీ కాళ్లు పట్టుకుంటాను నా కూతురు ఎక్కడుందో చెప్పమని దక్షిణామూర్తి కంటతడి పెట్టుకుంటాడు. జ్యోత్స్న ఎక్కడుందో నాకు తెలియదు కానీ తను వచ్చి నాకు దీనితో ఏ సంబంధం లేదనే వరకు ఇక్కడే ఉంటానని దక్షిణామూర్తి చెప్తాడు. జ్యోత్స్న గురించి కార్తీక్, దీప, సూరజ్ కంగారు పడుతుండగా సూరజ్ కి పోలీసుల నుంచి యాక్సిడెంట్ బాడీ మార్చురీలో ఉందని ఫోన్ వస్తుంది. సూరజ్ షాక్ అయి వెళ్లి చూస్తే అది జ్యోత్స్న కాదని తేలుతుంది. బయటకు వచ్చి కూర్చున్న సూరజ్ కి ఎదురుగా జ్యోత్స్న కనిపించి మాయం కావడంతో జ్యోత్స్న అంటూ పిచ్చివాడిలా అరుస్తాడు. ఆ బాడీ జ్యోత్స్నది కాదని కార్తీక్ కి మెసేజ్ చేయడంతో వాళ్లు సంతోషిస్తారు. కానీ సుమిత్ర మాత్రం నా మీద పగతో మాలిని ఏదో చేసిందని కంటతడి పెడుతుంది.

మరోవైపు గుమ్మం దగ్గరే దక్షిణామూర్తి, కారులో సూరజ్ పడుకుని ఉండటం కార్తీక్, దీపలు చూస్తారు. ఇంతలో సూరజ్ కి ఫోన్ రావడంతో కంగారుగా ఆఫీస్ కి వెళ్తాడు. ఆఫీస్ లో జ్యోత్స్న వర్క్ చేసుకుంటూ కనిపించడంతో సూరజ్ షాక్ అవుతాడు. పక్కకి తీసుకెళ్లి నీ మొబైల్ ఏమైంది, ఇన్నిరోజులు ఎక్కడికి వెళ్లావు.. ఇది నాలుగో రోజు అంటూ మండిపడతాడు. నువ్వు కనిపించకపోవడంతో మీ ఫ్యామిలీ మమ్మల్ని టార్చర్ పెట్టారు. మీ అమ్మ పోలీసులను తీసుకొచ్చి మా అమ్మని అరెస్ట్ చేస్తానంది.. నేను భయపడలేదని చెప్తాడు. రాత్రంతా నీ కోసం పిచ్చివాడిలా తిరిగాను‌‌‌.. యాక్సిడెంట్ బాడీ చూడటానికి మార్చురీకి కూడా వెళ్లానని సూరజ్ అంటాడు. ఈ మూడు రోజులు ఏమైపోయావు.. నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారని ప్రశ్నిస్తాడు. చేయని తప్పుకు నా ఫ్యామిలీ మీద నింద పడింది సమాధానం చెప్తావా అని నిలదీస్తాడు.

చెప్పనని జ్యోత్స్న అనడంతో ఆమెను కొట్టబోతుండగా మాలిని వచ్చి ఆపుతుంది, పనివాళ్ల మీద యజమానులు చెయ్యెత్తకూడదంటుంది. కొందరు కుటుంబాల మధ్యే కాదు తల్లీకొడుకుల మధ్య కూడా చిచ్చుపెడతారు. అనుమానం అనే అగ్గిని రాజేస్తారని అంటుంది మాలిని. ముందు జ్యోత్స్న వచ్చిందని తెలియాలని కార్తీక్ కి వీడియో కాల్ చేయిస్తుంది. కూతురిని చూసి సుమిత్ర సంతోషిస్తుంది. ఎక్కడున్నావని అడగ్గా ఆఫీసులో ఉన్నానని.. నేను కనిపించడమే ఒక సమాధానం అంటూ ఫోన్ పెట్టేస్తుంది.దక్షిణామూర్తికి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమని కార్తీక్ చెప్పగా శివన్నారాయణ మండిపడతాడు. సుమిత్ర మాత్రం దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటుంది. చివర్లో మాలిని ఆఫీసులో ఉండగా జ్యోత్స్న వెళ్లి ఒంటి మీద ఒక్క గీత కూడా పెట్టకుండా ఇంత సేఫ్ గా వదిలేశావని ప్రశ్నించడంతో మాలిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com