
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -804 లో.....జ్యోత్స్న ఏమైందో నాకు తెలీదు.. మీకు నచ్చిన చోట వెతుక్కోండి అని మాలిని తెగేసి చెప్తుంది. అందుకే ఇక్కడికి వచ్చామని శివన్నారాయణ అంటాడు. తాత అని సూరజ్ పిలిస్తే ఛీ నోర్ముయ్ అంటూ ఫైర్ అవుతాడు. నా మనవరాలిని ప్రేమ పేరుతో మోసం చేసి ఇప్పుడు మాయం చేశావని సూరజ్ ని నిలదీస్తాడు. నువ్వేం చేయకపోతే జ్యోత్స్న ఏమైంది అత్తా అని దీప ప్రశ్నిస్తుంది. అదేదో నీ సొంత చెల్లి అయినట్టు మాట్లాడుతున్నావని మాలిని అంటే జ్యోత్స్న నా సొంత చెల్లే అని దీప ఎమోషనల్ అవుతుంది. ఇద్దరం ఒకే తల్లి ప్రేమను పంచుకున్నామని దీప చెప్పడంతో సీన్ ఎమోషనల్ గా మారుతుంది. కార్తీక్ కూడా పిన్నిపై తనదైన స్టైల్లో సెటైర్లు వేయడంతో గొడవ మరింత ముదురుతుంది.
సుమిత్ర తండ్రి కాళ్లపై పడి నాన్న దండం పెడతా, జ్యోత్స్న ఎక్కడుందో చెప్పండని ఏడుస్తుంది. పీఏగా చేరినప్పటి నుంచి కనిపించడం లేదు..మీరే ఏదో చేశారని బతిమాలుతుంది. అసలు నా కూతురు బతికుందా, చంపేశారా అంటూ సుమిత్ర కన్నీరు మున్నీరవుతుంది. అప్పుడు నన్ను చంపాలనుకున్నారు. ఇప్పుడు నా కూతుర్ని చంపాలనుకుంటున్నారా అంటూ దశరథ్ సూరజ్ కాలర్ పట్టుకుంటాడు. నా మనవడు అలాంటి వాడు కాదని దక్షిణామూర్తి సపోర్ట్ గా మాట్లాడటంతో ఇద్దరు తాతల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఈ గొడవలో శివన్నారాయణ చొక్కాను చింపేస్తాడు దక్షిణామూర్తి. దీంతో అందరు షాక్ అవుతారు. విధి అంటే ఇదేరా, ఆ రోజు నీ కూతురి ఇంటి దగ్గర నువ్వు నా చొక్కా చింపితే ఈరోజు నా ఇంట్లో నీ చొక్కా చిరిగిందని దక్షిణామూర్తి రివెంజ్ తీర్చుకుంటాడు. వెయ్యి రూపాయలు అల్లుడి జేబులో పెట్టి మీ నాన్నకు కొత్త షర్టు కొనివ్వు అంటూ శివన్నారాయణను ఘోరంగా అవమానిస్తాడు.
అవమానంతో ఇంటికి వచ్చిన శివన్నారాయణ కుటుంబం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయిస్తుంది. క్షమించు నాన్న, నీకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానని దశరథ్ ఏడుస్తాడు. ఎప్పుడు బదులు తీర్చుకోవాలో నాకు తెలుసు.. కాలమే సమాధానం చెప్తుందని శివన్నారాయణ అంటాడు. వాళ్లు యుద్ధమే కోరుకుంటున్నారు. మనవరాలు ఇంటికి వచ్చాక అసలైన యుద్ధం మొదలవుతుందని అంటాడు. అందరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాలినిపై కంప్లైంట్ ఇస్తారు. వెంటనే పోలీసులు మాలిని ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలని అంటారు. చూడరా, మీ అత్తయ్య మళ్లీ పోలీసులను తీసుకొచ్చిందని సూరజ్ ముందు మాలిని డ్రామా మొదలుపెడుతుంది. నేను చస్తేనే మీకు హ్యాపీ అయితే నా గొంతు నులిమి చంపేయ్ అంటూ సుమిత్ర చేతులను పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
