.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -767లో.... దీప, కార్తీక్ లు తమని సూరజ్ ఎందుకు ఇరికించాడో అని చర్చించుకుంటారు. తండ్రి చావుకి పగ తీర్చుకోవడానికి సూరజ్, మాలిని, దక్షిణామూర్తి ముగ్గురూ పక్కా ప్లాన్ వేశారని కార్తీక్ అర్థం చేసుకుంటాడు. డబ్బులు తీసుకోకుండా జాబ్ చేయడం.. మన ద్వారా ఇంట్లోకి ఎంటర్ అవ్వడం అంతా ముందే వేసుకున్న గ్రౌండ్ వర్క్ అని, తన సామర్థ్యాన్ని తగ్గించుకుని వెళ్లే అవకాశం ఉన్నా వెళ్లకుండా ఉంటే వాడ్ని ఏదో శక్తి ఆపుతుంది.. ఆ శక్తే పగ అని తండ్రి చెప్పిన మాటను గుర్తుచేసుకుంటాడు కార్తీక్. కోటీశ్వరుడైన వాడికి జీతం ఎందుకంటూ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని మోసం చేశాడని కార్తీక్ రగిలిపోతాడు.
మరోవైపు పెళ్లి ఆగిపోవడంతో జ్యోత్స్న జీవచ్ఛవంలా మారిపోతుంది. పెళ్లి బట్టల్లోనే సూరజ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ తెరిచి చూస్తుంది. అందులో తను సూరజ్ కి ఇచ్చిన చైన్, వాడిపోయిన ఫ్లవర్స్.. అన్నీ తిరిగి ఇచ్చేశానని రాసిన కార్డ్ ఉండటం చూసి కుమిలికుమిలి ఏడుస్తుంది. ఆ సమయంలో పారిజాతం వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. సూరజ్ మాలిని కొడుకని తెలిసినప్పుడే తన ఫ్యూజులు ఎగిరిపోయాయని వాడే పెద్ద అబద్ధం అయినప్పుడు వాడి ప్రేమ నిజం ఎలా అవుతుందని నిలదీస్తుంది.
అయితే జ్యోత్స్న మాత్రం.. వాడి ప్రేమ అబద్ధం కావచ్చు.. నా ప్రేమ నిజం కదా గ్రానీ, గొంగళిపురుగు సీతాకోకచిలుక అవుతుంది కానీ సీతాకోకచిలుక మళ్లీ గొంగళి కాదంటూ సూరజ్ లాకెట్ ని గుండెలకు హత్తుకుంటుంది. వాడు వద్దనుకున్నా తను వద్దనుకోవడం లేదని తెగేసి చెప్తుంది. దీంతో పారిజాతం రగిలిపోతుంది. తండ్రి పగ కోసం ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న సూరజ్ ని, వాళ్ల అమ్మని వదిలిపెట్టనని పాత పారిజాతం నిద్రలేస్తే వాళ్లు పిల్ల బాతులేనని హెచ్చరిస్తుంది. మరో పెళ్లి చేసుకుని వాడి అహంపై దెబ్బ కొట్టాలని సలహా ఇస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం తను మారలేనని.. ప్రేమంటే ఏంటో తెలిసింది సూరజ్ వల్లేనని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
