Home

»

Tv News

Karthika Deepam2 :జ్యోత్స్న, దక్షిణామూర్తి మధ్య గొడవ.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

Sep 9, 2026 9:18AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2 .ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  773 లో.....జ్యోత్స్న పెళ్లి ఆగిపోయిన తర్వాత దీప, కార్తీక్ లు వెళ్లి మాలిని, సూరజ్ లను కలిసినందుకు శివన్నారాయణ ఘోరంగా అవమానించి పంపిస్తాడు. సూరజ్ తాత దక్షిణామూర్తిని మార్నింగ్ వాక్ కి తీసుకుని వస్తాడు. అదే పార్క్ లో బెంచ్ పై మౌనంగా కూర్చున్న జ్యోత్స్నను చూసి సూరజ్ వెళ్లిపోతాడు. కానీ దక్షిణామూర్తి ఆమె దగ్గరకు వెళ్లి.. అమ్మా, అమ్మ ఎలా ఉంది.. నేను మీ అమ్మకి తండ్రిని అని అంటాడు. దీంతో జ్యోత్స్న.. మర్చిపోలేని గాయం చేసి మర్చిపోయిందంటావా? మనవడిని అడ్డుపెట్టుకుని పగ సాధించావని ఫైర్ అవుతుంది. వాడు తండ్రి లేకుండా పెరిగాడు.. తల్లి బాధ చూస్తూ పెరిగాడు.. తల్లి కోసమే బతికాడని దక్షిణామూర్తి అంటే ఆ బాధ ఇప్పుడు నాకు ఇచ్చాడని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది.

 

ఇంతలో సూరజ్ వచ్చి కూర్చోవడంతో వాదన మరింత పెరుగుతుంది. మా నాన్న చావు కథ కాదు.. నిజం. మా అత్త కాళ్లు పోగొట్టుకోవడం కథ కాదని సూరజ్ అంటే మీరు చెప్పిన కథలే వాడి మనసులో ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. నేను ఇక్కడికి నీ కోసం కాదు.. నా మనశ్శాంతి కోసం.. పోగొట్టుకున్న నా మనసుని వెతుక్కోవడానికి వచ్చానని జ్యోత్స్న అంటే ఇక్కడ అందరం పోగొట్టుకుని వెతుక్కుంటున్న వాళ్లమే.. వీడు తండ్రిని, నేను కూతుర్ని, నువ్వు మనసుని అని దక్షిణామూర్తి అంటాడు. కొంతమందికి సలహాలు ఇవ్వక్కర్లేదని సూరజ్ తాతను తీసుకుని వెళ్లిపోతాడు. కత్తి గుచ్చి జాగ్రత్తలు చెప్పినట్లు ఉందని జ్యోత్స్న కూడా అనేసి వెళ్లిపోతుంది.

 

మరోవైపు జ్యోత్స్న రెస్టారెంట్ ఉద్యోగులు భద్రత లేదని కార్తీక్ తో చెప్పగా శివన్నారాయణ వచ్చి.. మీ ఉద్యోగాలకు ఇబ్బంది లేదు.. ఏదైనా నాతో చెప్పండి వీళ్లతో కాదని దీప, కార్తీక్ లను అవమానిస్తాడు. ఆఫీస్ లో సూరజ్ జ్ఞాపకాలు వెంటాడటంతో జ్యోత్స్న అతని చైర్ టేబుల్ తీయిస్తుంది. దీప వచ్చి.. సూరజ్ రాలేదనుకుని మర్చిపో అనగా నేను వదిలేసిన జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు.. నేను సూరజ్ ని ప్రేమించేలా చేసింది మీరే, మీపై పడ్డ నిందకు బాధ్యత మీదే.. దాన్ని పోగొట్టుకోండి అని చెప్పి జ్యోత్స్న ఇంటికి వెళ్లిపోతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com