.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 karthika Deepam2.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 787 లో.....గొప్పింటి బిడ్డ అయిన జ్యోత్స్న కష్టాల్లో పడి ఉద్యోగం కోసం ఓ రెస్టారెంట్ కి వెళ్తుంది. యజమాని..నిన్ను చూస్తే బాగా చదువుకున్న దానిలా ఉన్నావు.. ఇక్కడ మేనేజర్ పోస్టులు లేవు అంటే పర్లేదు సర్ ఏ పని అయినా చేస్తానని జ్యోత్స్న అంటుంది. దీంతో వెయిటర్ పని ఉందని చెప్పి, కస్టమర్లు అరిచినా తప్పు లేకపోయినా సారీ చెప్పాలని కండిషన్ పెట్టి జాబ్ ఇస్తాడు. జ్యోత్స్న కాస్త ఆలోచించి వెయిటర్ గా జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. ఇంటికి వచ్చేసరికి సూరజ్ అక్కడ ఉండటంతో..మళ్లీ ఆస్తులు లాగేసుకుని ఇల్లు కూడా లాగేసుకోవడానికి వచ్చారా అంటూ జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
మరోవైపు కార్తీక్, దీప మాలినికి గట్టి షాక్ ఇచ్చారు. జ్యోత్స్న రెస్టారెంట్స్ ఉన్నంత కాలం దీపే శాశ్వత సీఈఓ అని బోర్డు మెంబర్స్ అందరూ సంతకం పెట్టారని కార్తీక్ చెప్తాడు. దీపను సీఈఓ పోస్ట్ నుంచి తప్పించాలంటే 10 కోట్లు కట్టాలని అగ్రిమెంట్ లో ఉందని లీగల్ అడ్వైజర్ కూడా కన్ఫమ్ చేస్తాడు. కోపంతో మాలిని ఆ అగ్రిమెంట్ ని చింపేయగా, కార్తీక్ మరో కాపీ తీసి.. ఇవన్నీ కలర్ జిరాక్సులు, అసలు అగ్రిమెంట్ వేరే చోట సేఫ్ గా ఉందని చెప్పి మాలినికి షాక్ ఇస్తాడు. సాయంత్రం లోపు నిర్ణయం చెప్పాలి, లేదంటే కోర్టుకు వెళ్తామని చెప్పి కార్తీక్, దీప అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఆ తర్వాత మాలిని నేరుగా కార్తీక్ ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంది. శౌర్య చేతికి గాయం చూసి సానుభూతి నటిస్తూనే.. ఈ ఇల్లు కూడా అనాథాశ్రమంలా ఉందంటూ సుమిత్ర, శివన్నారాయణలను అవమానిస్తుంది. దీంతో కాంచన.. ఇది నా ఇల్లు, వీళ్లు నా వాళ్లు, ముందు నువ్వు బయటకు వెళ్లమని ఫైర్ అవుతుంది. అప్పుడు మాలిని కుర్చీలో కూర్చుని.. నేను మీ కోసం రాలేదు, దీప, కార్తీక్ కోసం వచ్చాను. వాళ్లే నాకు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చి నన్ను ఆహ్వానించారంటూ అగ్రిమెంట్, సూట్ కేసు వాళ్ల ముందు పెడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 787, Star Maa Serial, Jyotsna, Deepa, Karthik, Suraj, Malini, Kanchana, Sowrya, Restaurant Job]





.webp)
