స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -789 లో....జ్యోత్స్న మాటలతో మాలిని సూరజ్ పర్స్ చెక్ చేయడం.. సూరజ్ అది చూసేయడంతో గొడవ మొదలవుతుంది. మాలిని జ్యోత్స్న మాటలు తలచుకుని సూరజ్ మనసులో జ్యోత్స్న ఉందా.. పర్స్ లో తన ఫోటో పెట్టుకున్నాడా అని పర్స్ తీస్తుంది. ఇంతలో సూరజ్ వచ్చి చూసేస్తాడు. జ్యోత్స్న ఏం చెప్పింది అమ్మా, అప్పుడు కార్తీక్ చెప్పగానే నీ మనసులో జ్యోత్స్న ఉందా అని అడిగావ్.. ఈరోజు జ్యోత్స్న మాట్లాడగానే నేరుగా పర్స్ చూస్తున్నావని సూరజ్ నిలదీస్తాడు. నీ పర్స్ చూసే అధికారం నాకుందని మాలిని పర్స్ మొత్తం వెతికితే జ్యోత్స్న ఫోటో కనిపించదు. ఎక్కువ నమ్మకం ఉంటే ఇలాంటి అనుమానాలు వస్తాయని మాలిని కవర్ చేస్తుంది. ఆ తర్వాత విజయ్ అనే మనిషిని పిలిచి.. సూరజ్ ని ఫాలో అవుతూ ఉండు.. అన్నీ నాకు చెప్పు, కానీ తనకి తెలియకూడదని ఆర్డర్ వేస్తుంది.
మరోవైపు కార్తీక్, దీపలను జ్యోత్స్న నిలదీస్తుంది. మీ స్వార్థం కాకపోతే ఎందుకు మాలిని తీసుకున్న మన ఆఫీస్ కి వెళ్లారు.. మీరు ఇలాగే చేస్తే మాటలు పడతారు.. మనకి సంబంధం లేని ఆఫీస్ కి వెళ్లి ఎవరి కింద మీరు ఊడిగం చేయాల్సిన పని లేదు.. వెళ్లొద్దు రిజైన్ చేయండి దీపా అని జ్యోత్స్న అంటుంది. దానికి కార్తీక్.. మేం వెళ్లాం జ్యోత్స్నా, నువ్వు అగ్రిమెంట్ రాయడం వల్ల మనకి మంచి జరిగింది కదా, ఇప్పుడు కూడా మంచే జరుగుతుంది..మన ముగ్గురి జీవితాలు ఓ సర్కిల్ లో తిరుగుతున్నాయి. మన ముగ్గురం మన ఫ్యామిలీ కోసమే పోరాడుతున్నానని అంటాడు. దీప.. పెంచిన కూతురు నువ్వే ఇంత బాధపడితే కన్నకూతుర్ని నేను ఇంకెంత ఆలోచిస్తానో తెలీదా అని అంటుంది. సరే అయితే మీకు నేను అడ్డు రాను, నాకు పాలిచ్చి పెంచిన సుమిత్రే నా తల్లి, ఈ కుటుంబం కోసం నేను ఓ పని చేస్తున్నా మీకు చెప్పనని తెగేసి చెప్తుంది.
జ్యోత్స్న వెయిటర్ గా మారుతుంది.. జ్యోత్స్న వెయిటర్ గా ఓ రెస్టారెంట్ లో పనికి వెళ్తుంది. వెయిటర్ డ్రెస్ వేసుకుని మిస్ హైదరాబాద్ కిరీటం తీసుకునే రోజుని గుర్తు చేసుకుంటుంది. జాయిన్ అయిన మొదటి రోజే కొంతమంది.. ఇంత అందంగా ఉన్నావ్ నెంబర్ ఇవ్వమని వేధిస్తారు. ఆ తర్వాత ఆర్డర్ తీసుకోవడానికి.. సర్ ఆర్డర్ ప్లీజ్ అని జ్యోత్స్న అంటుంది. తీరా చూస్తే అక్కడ సూరజ్ ఉంటాడు. జ్యోత్స్నను సూరజ్ చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే నా ఫ్యామిలీని పోషించుకోవడానికి జాబ్ ఉండాలి కదా సర్.. అందుకే ఇది చేస్తున్నానని జ్యోత్స్న అంటుంది. ఈ విషయం మీ ఫ్యామిలీకి తెలుసా అని సూరజ్ అడిగితే. తెలియాల్సిన అవసరం లేదని అంటుంది. సూరజ్ కాఫీ ఆర్డర్ చేస్తాడు. జ్యోత్స్న తెచ్చేలోపు మాలిని ఫోన్ చేయడంతో 50 రూపాయల నోటు అక్కడ పెట్టి వెళ్లిపోతాడు.
చివర్లో మాలిని, సూరజ్, కార్తీక్ ల సమక్షంలో దీప సీఈఓగా ఛార్జ్ తీసుకుంటుంది. కంగ్రాట్స్ కాంచన కోడలా అని మాలిని అంటే మా అత్త ఎందుకు వచ్చింది ఇప్పుడు.. మేనకోడలా అని పిలవమని దీప అంటుంది. నువ్వేం సుమిత్ర కన్నకూతురు కాదు కదా అని మాలిని ఎద్దేవా చేస్తుంది, ఆ తర్వాత దీప, కార్తీక్ లకు జీతంగా ఒక రూపాయి ఇస్తుంది. మండిపోతున్నారా అని మాలిని అంటుంది. ఎందుకు మండిపోతాం, మేం ఇక్కడికి డబ్బు కోసం రాలేదని కార్తీక్ అంటాడు. మీకు తెలీదు అంటే నమ్ముతావా.. మా తాత ముందు మేం నీ బంధువులం అని తెగ చెప్పావ్ కదా, ప్రేమలు పంచేయాలని వచ్చామని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam 2 Today Episode September 26, Karthika Deepam 2 Serial Latest, Jyotsna Waiter Suraj Coffee, Deepa CEO One Rupee Salary]




