Home

»

Tv News

Karthika Deepam2 : పిల్లో కింద ఫోటో చూసి సూరజ్ ని నిలదీసిన జ్యోత్స్న!

Oct 29, 2026 10:58AM

Karthika Deepam2 : పిల్లో కింద ఫోటో చూసి సూరజ్ ని నిలదీసిన జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -816 లో..... జ్యోత్స్న ఫైల్స్ తీసుకొచ్చి సూరజ్ కి ఇచ్చి మాలిని, సూరజ్ లను ఇరిటేట్ చేస్తుంది. సూరజ్ వెళ్లిపోమంటే దక్షిణామూర్తి టిఫిన్ చేయమని అంటాడు. సర్ వద్దంటారేమో అని జ్యోత్స్న అంటే ఏం అనరులే అని దక్షిణామూర్తి అంటాడు. సూరజ్ విసుక్కుంటూ తినొచ్చు అనగానే లవ్ యూ సర్ అని జ్యోత్స్న అంటుంది. సూరజ్, మాలిని బిత్తరపోతారు. థ్యాంక్స్ కి బదులు ఇప్పుడు లవ్ యూ అంటున్నారని కవర్ చేస్తుంది. తర్వాత దక్షిణామూర్తి జ్యోత్స్నతో వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం, పీఏ అంటే ఏంటి అని అడిగితే పర్సనల్ అసిస్టెంట్ అని చెవిలో చెప్తుంది.

దక్షిణామూర్తి నీకు సూరజ్ అంటే ఇష్టం కదా, ఇప్పటికీ ప్రేమిస్తున్నావ్ కదా అని అడిగితే జ్యోత్స్న సైలెంట్ అవుతుంది.వాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయట పడటం లేదని అంటాడు.సూరజ్ ఫోన్ కి కాల్ రావడంతో జ్యోత్స్నని గదికి పంపిస్తాడు. కొన్నిసార్లు కోపం కూడా ప్రేమే అని చెప్తాడు. జ్యోత్స్న గదిలోకి వెళ్లి స్టోర్ రూం అనుకుంటూ సర్దుతూ పర్సులో ఫొటో ఉందా అని చూస్తుంది. అందులో ఉండదు. పిల్లో కింద ఫొటో చూస్తుంది. ఇంతలో సూరజ్ వచ్చి లాక్కుంటాడు. నా రూంలోకి ఎందుకు వచ్చావ్ అని సూరజ్ అంటే తాత పంపాడని జ్యోత్స్న అంటుంది. నా ఫొటో ఎందుకు ఉంచుకున్నావని జ్యోత్స్న అడుగుతుంది. అది నా ఇష్టం, వస్తువే అని వాదిస్తాడు.

జ్యోత్స్న కోపంగా చూసి.. నీ మనసు వెనక కన్నీటి సముద్రం ఉంది, దాని ఘోష నేను విన్నానని అంటుంది. ఎవరికో ఇచ్చిన మాట కోసం మనసు ఇచ్చిన వ్యక్తిని వదిలేస్తున్న నీ పంతం వెనక ప్రేమని చూశానని అంటుంది. హాల్ లో ఉన్న మీ నాన్న ఫొటో, పిల్లో కింద ఉన్న నా ఫొటో ఒకటే అని అంటుంది. సూరజ్ నువ్వు భ్రమలో ఉన్నావ్ అంటే నీ మనసు అనే సముద్రంలో ఉన్న ఒకే ఒక్క ఆడదాని పేరు జ్యోత్స్న అని అంటుంది. పీఏ అంటే ఏంటి అని సూరజ్ అడిగితే డిక్షనరీ వెతకండి అని చెప్పి వెళ్లిపోతుంది. శివన్నారాయణ ఫ్రెండ్ రెస్టారెంట్ కి వచ్చి తల్లిని దత్తత తీసుకున్నావా అని సూరజ్ ని అడగడం, శివన్నారాయణ గొప్పతనం చెప్పడంతో మాలినికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com