స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -720 లో...... దీప గురించి కార్తీక్ మాలినికి చెప్తుంటే అప్పుడే శివన్నారాయణ వస్తాడు. తనకి తెలియదని చెప్తున్నావా.. అంతా తెలుసు తెలిసే ఇలా నాటకాలు ఆడుతారని శివన్నారాయణ అంటాడు. ఆవిడ ఎవరు అని దీప అడుగుతుంది దక్షిణామూర్తి కోడలు అని కార్తీక్ చెప్తాడు. కావాలనే ఇదంతా చేసున్నారని శివన్నారాయణ అనగానే మీ వాళ్ళ దగ్గర నీ విలువ ఎంత ఉందో తెలుసుకోవడానికి అయి ఉంటుంది కావచ్చు కదా అని దక్షిణామూర్తి అనగానే నా వాళ్ళ దగ్గర నా విలువ ఎంత ఉందో నాకు తెలుసని శివన్నారాయణ అంటాడు.
ఏంటి నీ విలువ ఇంట్లో నుంచి మనవడు కూతురిని పంపించడమా.. మనవడిని డ్రైవర్ గా పెట్టుకొని పనిమనిషిని సీఈఓ చేయడమా అని మాలిని అనగానే తనపై శివన్నారాయణ కోప్పడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కార్తీక్ ఆపే ప్రయత్నం చేస్తాడు. చేసిన పాపం వెంటాడుతుంది. ఆ కుటుంబం కారణంగా నా కోడలు అని దక్షిణామూర్తి ఏదో చెప్పబోతుంటే మాలిని ఆపుతుంది. ఆ తర్వాత మాలిని అందరి గురించి తెలుసుకుంటుంది. సూరజ్ ని చూసి అతను ఎవరని అడుగుతుంది. మా కుటుంబంలో ఒకరు అని శివన్నారాయణ చెప్తాడు. కార్తీక్, దీప మీరు మా మావయ్య గారిని కాపాడినందుకు థాంక్స్ అని మాలిని చెప్తుంది. ఆ తర్వాత శివన్నారాయణ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏది అనుకోకుండా జరగలేదు మావయ్య.. అంతా నాకు తెలిసే జరుగుతుందని మాలిని అనుకుంటుంది.
ఆ తర్వాత శౌర్యని కాంచన రెడీ చేస్తుంది. అప్పుడే అనసూయ ఊరు నుంచి వస్తుంది. మరొకవైపు మాలిని మాటలు గుర్తుచేసుకొని నాకు అత్తయ్య ఉందని కార్తీక్ తో దీప అంటుంటే ఆ ఆలోచన లు మానెయ్ తాతకి లేని చుట్టాలు మనకి లేరు అని కార్తీక్ అంటాడు. అప్పుడే సూరజ్ వస్తాడు. వాళ్ళ మాటలు వింటాడు.. మరుసటి రోజు జ్యోత్స్న ని సూరజ్ స్కూటీ పై ఆఫీస్ కి తీసుకొని బయల్దేరతాడు. స్కూటీ ఆపమని జ్యోత్స్న చెప్తుంది. నిన్న శని పూజ చెయ్యడం వల్ల మంచి అమ్మాయి దొరికింది అని సూరజ్ అనగానే ఎవరు ఆ దురదృష్టవంతురాలు అని జ్యోత్స్న అనగానే సూరజ్ తన ఫోన్ లో ఉన్న జ్యోత్స్న ఫోటో ని చూపిస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




