ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam 2: దొరికిపోయిన జ్యోత్స్న.. దాస్ ని కార్తీక్ కనిపెడతాడా?

on Feb 1, 2026

 

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -582 లో.. కాశీ, స్వప్నలని కలపమని శ్రీధర్ ని కాంచన అడుగుతుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. మీ అమ్మ స్వప్నకి నచ్చజెప్పి కాశీ, స్వప్నలని ఒక్కటి చేయమని అడుగుతుంది. అలాంటప్పుడు మీ అమ్మ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. కొడుకుగా మీరు బాగుండాలని అనుకుంటా కానీ మీ నిర్ణయం మీకే వదిలేస్తున్నానని కార్తీక్ అంటాడు. నా కొడుకు నా నిర్ణయం సమర్థిస్తున్నప్పుడు నేనెందుకు నిర్ణయం మార్చుకోవాలి.. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మార్పు ఉండదు.. మీరు స్వప్న, కాశీలని కలపండి.. స్వప్నకి నచ్చజెప్పండి అని కాంచన అంటుంది. దాంతో శ్రీధర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాశీ నువ్వు స్నానం చేసి.. నా బట్టలు వేసుకొని భోజనం చెయ్ అని కాశీతో కార్తీక్ చెప్తాడు.

 

మరొకవైపు సుమిత్ర దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. సుమిత్ర నిద్రపోతుంది. ట్యాబ్లెట్లు పట్టుకొని ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే బాగుంటావని డాక్టర్ చెప్పింది. నువ్వు బాగుంటే నాకు ప్రాబ్లమ్ అని ట్యాబ్లెట్స్ తీసుకొని డస్ట్ బిన్ లో పడేస్తుంది. అప్పుడే దశరథ్ వచ్చి ఎందుకు అలా ట్యాబ్లెట్స్ పడేసావని దశరథ్ అడుగుతాడు. జ్యోత్స్న షాక్ అవుతుంది. పారిజాతం, శివన్నారాయణ వస్తారు. ఎందుకు అలా చేసావని అందరు కోప్పడతారు. ట్యాబ్లెట్లు కింద పడిపోయాయి.. అవి ఏం యూజ్ అవుతాయి. ఇదిగోండి ఒక్క టాబ్లెట్ ఉందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న దయచేసి ఇంకొకసారి ఈ గదిలోకి రాకు.. నా భార్యని చూసుకోవడానికి నాకు వీలు కాకుంటే దీప గాని కార్తీక్ గాని చూసుకుంటారు అనగానే జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. ఎందుకు అలా అంటున్నారని సుమిత్ర అనగానే.. అంటే తను నీకేమైనా అవుతుందేమోనని భయపడుతుందని దశరథ్ అంటాడు. 

 

ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా.. ఇప్పుడు ఆ దాస్ తో మాట్లాడాలని వెళ్తుంటే.. పారిజాతం ఎదరుపడి ఎక్కడికి అని అడుగుతుంది. కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్తున్నావ్.. ఇంత అర్థరాత్రి అని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంటే జ్యోత్స్నని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది. కార్తీక్ చెప్పిన కొద్ది పారిజాతం కొడుతూనే ఉంటుంది అప్పుడే దశరథ్, శివన్నారాయణ వస్తాడు. ఇంత అర్థరాత్రి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. సంబంధం లేకుండా సమాధానం చెప్తుంది. పారిజాతం, జ్యోత్స్నకి లోపలికి తీసుకొని వెళ్తుంది. 

 

కార్తీక్ ని ఇప్పుడు ఎందుకు పిలిచావని దశరథ్ తో శివన్నారాయణ అడుగుతాడు. మాట్లాడాలని దశరథ్, కార్తీక్ ని పక్కకి తీసుకొని వెళ్లి జ్యోత్స్న ట్యాబ్లెట్స్ డస్ట్ బిన్ లో వేసింది. ఎందుకో ప్రవర్తన చేంజ్ గా కన్పిస్తుంది. అసలు దాస్ ఏమై ఉంటాడని కార్తీక్ తో దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.