Karthika Deepam 2: శ్రీధర్ కి మాటివ్వని దీప.. కార్తీక్, కాశీ కలిసిపోయారా?
on Dec 16, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -541 లో... కాంచన ఎలాగూ కావేరి ఇంటికి రాదని శ్రీధర్, కాంచన కోసం టిఫిన్ పంపిస్తాడు. తిని ఎలా ఉందో చెప్పు.. నా చేత్తో నేనే చేసానని శ్రీధర్ ఫోన్ లో కాంచనకి చెప్తాడు.
మరొకవైపు కార్తీక్, దీప టిఫిన్ చేస్తారు. అన్ని స్వయంగా మీ నాన్న గారు చేశారని కావేరి చెప్తుంది. అందరు టిఫిన్ చేస్తారు. మరొకవైపు శ్రీధర్ పంపించిన టిఫిన్ ని కాంచన తింటూ ఎమోషనల్ అవుతుంది. మీకేనా ప్రేమ నాకూ కూడా ఉందని అనుకుంటుంది.
ఆ తర్వాత దీపతో శ్రీధర్ మాట్లాడతాడు. దీప నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి.. మీ అత్తగారి పక్కన నన్ను నిలబెడుతావా.. నాకు మాటివ్వు అని శ్రీధర్ అడుగుతాడు. ఇప్పుడు ఇవ్వలేను మావయ్య అత్తయ్య మనసులో ఏముందో తెలియాలంటే మీరు కొన్ని రోజులు అత్తయ్యకి దూరంగా ఉండాలి ఎదురుపడకూడదని దీప అనగానే అది నా వల్ల కాదని శ్రీధర్ అంటాడు.
మరొకవైపు కాశీ దగ్గరికి కార్తీక్ వెళ్లి అసలు ఏమైందని అడుగుతాడు. ఇలా ఉండకూడదని మోటివేట్ చేస్తాడు. అప్పుడే స్వప్న వస్తుంది. తనకి కూడా క్లాస్ తీసుకుంటాడు. భర్తకి తోడుగా ఉండమని చెప్తుంది.
ఆ తర్వాత కాశీ, దీపలని శివన్నారాయణ కార్ లో ఇంటికి తీసుకొని వస్తాడు. కార్ లో అలా వస్తున్నారంటే విఐపి లు అయి ఉంటారని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. తీరా చూస్తే దీప ఉంటుంది. పనిమనిషికి కూడా డ్రైవర్ ఉంటారా అని పారిజాతం అంటుంది.
మరొకవైపు స్కూటీపై కార్తీక్, శ్రీధర్ వెళ్తారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఒకదగ్గర ఆగి టీ తాగాలని అనుకుంటారు. అప్పుడే ఫోన్ లో జ్యోత్స్న ఫుడ్ ట్రక్ కి బాగా క్రేజ్ ఉందని చూసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. టీ లో షుగర్ ఎక్కువ వెయ్యండి అని కార్తీక్ అనగానే ఎందుకురా అని శ్రీధర్ అంటాడు. నోరు తీపి చేసుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



