Home

»

Tv News

Karthika Deepam 2: జ్యోత్స్న కేసుతో రెచ్చిపోయిన మాలిని.. కార్తీక్ , దీప సవాల్.!

Oct 25, 2026 9:46AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -813 లో.. జ్యోత్స్న తనపై జరిగిన ఎటాక్ పై పోలీసులకు మాలిని మీద అనుమానం ఉందని చెప్పడంతో రచ్చ మొదలైంది. సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, నీ మీద పరువు నష్టం కేసు పెడతానని మాలిని రెచ్చిపోతుంది. 

జ్యోత్స్న సూరజ్ పంపిన వాయిస్ మెసేజ్ లను సాక్ష్యంగా చూపిస్తుంది. సూరజ్ నా గురించి కంగారు పడి ఆవిడ ఏమైనా చేస్తుందని చెప్పాడని అంటుంది. కేసు అయిపోయే వరకు ఎక్కడికి వెళ్లినా స్టేషన్ లో చెప్పాలి, పిలిచినప్పుడు రావాలని మాలినికి పోలీసులు వార్నింగ్ ఇస్తారు. బయట పోలీస్, కార్తీక్ చేయి కలపడం చూసి మాలిని.. ఇదంతా కార్తీక్ ప్లానా అని రగిలిపోతుంది.

మరోవైపు దశరథ్ టిఫిన్ బండి వద్ద కష్టపడుతుంటాడు. ఈ బండితో ఎన్ని రోజులు, చిన్న హోటల్ పెట్టి తర్వాత లోన్ తీసుకుని రెస్టారెంట్ పెట్టాలని పెద్దాయన సలహా ఇస్తాడు. సుమిత్ర మామయ్య బాధ చూసి.. నా కూతురి పెళ్లి భారం మీ మీద వేయలేనని చెప్పి బయటకు వెళ్లి ఓ ఇంట్లో వంట మనిషిగా చేరుతుంది. వంట టేస్ట్ నచ్చడంతో నెలకు 7 వేలకు పనిలోకి తీసుకుంటారు.

ఇంట్లో కార్తీక్, దీపలను మాలిని  పిలిచి.. నా ఉప్పు తింటూ విశ్వాసం లేకుండా నా మీద కేసు పెట్టించారా అని నిలదీస్తుంది. జ్యోత్స్న కాలిన పెనం లాంటిది, పట్టుకుంటే చేతులు, వదిలేస్తే నెత్తి కాలిపోతుందని  కార్తీక్ అంటాడు. మాది రహదారి, మా జోలికి వస్తే ముత్యాలమ్మ జాతరే అని దీప వార్నింగ్ ఇస్తుంది. 

చివర్లో మాలిని దక్షిణామూర్తి దగ్గరకు వెళ్లి.. జ్యోత్స్న మీ రుణం తీర్చుకుంది, కార్తీక్, దీప, జ్యోత్స్న ముగ్గురూ కలిసి మన పతనానికి ప్లాన్ చేస్తున్నారు, ఇదంతా శివన్నారాయణ ప్లానే అని చెప్పడంతో దక్షిణామూర్తి.. నీ జోలికి వస్తే నా జోలికి వచ్చినట్లే, అక్కడే తేల్చుకుందాం పద.. అని శివన్నారాయణ వద్దకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2 Episode 813, Karthika Deepam 2 Oct 24th Episode, 24th, Karthika Deepam 2 Today Episode, Karthika Deepam 2 Latest Episode, Karthika Deepam 2 Serial, Telugu TV News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com