Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!
on Jan 14, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.
లేదు శివన్నారాయణకి మాత్రమే చెప్పాలని దాస్ అంటాడు. దాస్ ఏదో చెప్పబోతుంటే ఏంటి మావయ్య కాశీని విడిపించడానికి జ్యోత్స్నని రిక్వెస్ట్ చేశారు అంతే కదా అని దాస్ కి సైగ చేసి చెప్పవద్దని చెప్పడంతో దాస్ ఆగుతాడు. అ తర్వాత దాస్ వెళ్లిపోతుంటే.. కార్తీక్ బయటకు వచ్చి ఏంటి మావయ్య నిజం చెప్పడానికి సమయం సందర్బం ఏది లేదా.. అత్తకి తన ప్రాబ్లమ్ గురించి తెలియదు.. ఇప్పుడు చెప్తే ఎలా అని కార్తీక్ అంటాడు. వాళ్ళు మాట్లాడుకునేది జ్యోత్స్న పైనుండి చూస్తుంది కానీ తనకు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు.
మరొకవైపు శ్రీధర్ ఇంటికి వస్తాడు. కాశీ, దాస్ కూడా వస్తారు. శ్రీధర్, కాశీని బెయిల్ పై తీసుకొని వచ్చాడు. అసలు ఎందుకు తీసుకొని వచ్చావ్.. నీకు అంత ద్రోహం చేసాడని కాశీని స్వప్న తిడుతుంది. కాశీ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప నువ్వు రేపటి నుండి అక్కడికి వెళ్ళకు. ఈ రోజు జ్యోత్స్న ఏం చేసిందో గుర్తు ఉంది కదా.. తనకి అసలే నువ్వు అంటే కోపం అని కాంచన అనగానే లేదు అత్తయ్య వెళ్తానని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



