Karthika Deepam2: సొంత నాన్ననే బంధించిన జ్యోత్స్న.. కార్తీక్ కనిపెడతాడా!
on Jan 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-568 లో.. జ్యోత్స్న దగ్గరికి దాస్ వస్తాడు. నిజం చెప్తానని అంటాడు. నిజం చెప్తే ఏం జరుగుతుందో అదంతా జ్యోత్స్న ఊహించుకుంటుంది. శివన్నారాయణ, సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న, పారిజాతం అందరు ఇంట్లో మాట్లాడుకుంటు ఉంటారు. జ్యోత్స్న మీ కూతురు కాదు వదిన అని దాస్ అనగానే తను షాక్ అవుతుంది. మరి తను ఎవరి కూతురు అని దశరథ్ అనగానే నా కూతురు అని దాస్ అంటాడు. బిడ్డలు మారిపోయారు అన్నయ్య అని దాస్ అనగానే ఎలా తెలుసని దశరథ్ అంటాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి అన్నయ్య అని దాస్ అంటాడు. నీ బిడ్డ స్థానంలో నా బిడ్డని పెట్టి నీ బిడ్డని చంపడానికి తీసుకెళ్ళానని దాస్ అంటాడు.
శివన్నారాయణ కోపంతో ఊగిపోయి దాస్ దగ్గరికి వెళ్తాడు. గన్ తీసుకొచ్చి ఎందుకిలా చేశావని అడుగుతాడు. మా అమ్మ పారిజాతం మీ మీద కోపంతో ఇలా చేసిందని.. నేను గతం మర్చిపోవడానికి కారణం కూడా జ్యోత్స్ననే అని దాస్ అన్ని నిజాలు చెప్తాడు. దాంతో పారిజాతం తన తప్పు రియలైజ్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు పట్టిందా నేను ఏం తప్పు చేశానో నాకు తెలవడానికి అని పారిజాతం అనుకొని గన్ తీసుకొని జ్యోత్స్నని షూట్ చేస్తుంది. వెంటనే గ్రానీ అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఏంటి గ్రానీ.. అప్పుడే కల కన్నావా జ్యోత్స్న అని దాస్ అంటాడు. నిజం చెప్పొద్దు నాన్న అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. లేదు జ్యోత్స్న నువ్వు వినవు అని దాస్ అంటాడు. దాస్ ని వెంటనే స్ప్రే కొట్టి మూర్చపోయేలా చేస్తుంది జ్యోత్స్న. నా జాగ్రత్తలో నేనున్నాను అని జ్యోత్స్న అంటుంది. ఇక రౌడీలని పిలిచి దాస్ ని తీసుకెళ్ళమంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. వెంటనే దాస్ ని వేరేవైపు తీసుకెళ్ళమంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావని అంటుంది. ఇక కార్తీక్ వచ్చి.. ఏంటి జ్యోత్స్న ఇక్కడ అని అడుగుతాడు. మాములుగానే ఉన్నానని జ్యోత్స్న అంటుంది. దాస్ మామయ్య వచ్చాడా అని కార్తీక్ అడుగుతాడు. రాలేదని జ్యోత్స్న, పారిజాతం అంటారు.
నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్ జ్యోత్స్న అని కార్తీక్ అనగానే మాములుగానే ఉన్నాను బావ అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దాస్ ఉన్నాడా లేడా అని అటుఇటు చూసి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ కోసం దీప ఎదురుచూస్తుంటుంది. అప్పుడే కాంచన వచ్చి. కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. దాస్ బాబాయ్ కాల్ చేస్తే వెళ్ళాడని దీప చెప్తుంది. మీరిద్దరు ఆదర్శ దంపతుల లాగా ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారని కాంచన అంటుంది. కార్తీక్ కి కాంచన కాల్ చేస్తుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏమైందని కార్తీక్ ని కాంచన అడుగగా.. దాస్ మామయ్య కాల్ చేశారు.. వెళ్ళాను.. కానీ అక్కడ మామయ్య లేడు అని కార్తీక్ అంటాడు. మరోవైపు దాస్ ని తాళ్ళతో కట్టేసి ఒక గదిలో బంధిస్తుంది జ్యోత్స్న. అక్కడికి వెళ్ళి దాస్ తో మాట్లాడుతుంది జ్యోత్స్న. ఎందుకు నాన్న నీ కూతురు జీవితం నాశనం కావాలని చూస్తున్నావని జ్యోత్స్న అనగానే.. నువ్వు తప్పులు చేసే స్థాయి నుండి పాపాలు చేసే స్థాయికి వచ్చావని దాస్ అంటాడు. అప్పుడే కార్తీక్ దగ్గరి నుండి దాస్ కి ఫోన్ వస్తుంది. అది చూసి జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నువ్వు టెన్షన్ పడుతున్నావంటే అది కార్తీక్ కాల్ ఏ కదా అని దాస్ నవ్వుతాడు. ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టండి.. ఇది ఇలా ఆన్ లోనే ఉండాలి.. సిటీ అంతా తిరగండి అని రౌడీలతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



