Home

»

Tv News

Godhavari : నందు పెళ్లి కోసం జానూ సాహసం.. సూర్యతో బైక్ జర్నీలో ఊహించని ట్విస్ట్!

Jun 13, 2026 10:31AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -29 లో..... పెళ్లి సంబంధం వద్దని అరవింద్ వాళ్ళు చెప్పడం.. మేము పెళ్లి చెయ్యలేమని అనుకుంటున్నారా చేస్తాం.. తోట కూడా ఇస్తామని జానూ చెప్తుంది. తోట ప్రాబ్లమ్ లో ఉందని సింహాద్రి అంకుల్ చెప్పాడని అరవింద్ చెప్పగానే.. మీరు అమెరికా వెళ్ళడానికి పది రోజులు టైమ్ ఉంది కదా ఆ లోపు తోట రిజిస్ట్రేషన్ పేపర్స్ మీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తానని వాళ్లకి జానూ చెప్తుంది. ఆ తర్వాత సూర్య బైక్ పై జానూ వెళ్తు.. నా ఫ్రెండ్ అలాంటి వాడు.. ఇలాంటి వాడు అని బిల్డప్ ఇచ్చావని సూర్యని జానూ తిడుతుంది.

ఏంటండి అలా అంటున్నారని సూర్య అంటాడు. అప్పుడే బండి ఆగిపోతుంది. అమ్మాయి బండి ఎక్కినప్పుడు బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా అని జానూ అంటుంది. నా బైక్ ఎక్కింది నా లవర్ అయితే అన్నీ చెక్ చేసుకునే వాడిని కానీ నువ్వు కాదుగా అని సూర్య అంటాడు. ఆ తర్వాత జానూ బైక్ మీద కూర్చొని ఉంటుంది. సూర్య బండి తోసుకుంటూ వెళ్తాడు. కాసేపటికి జానూ ఇంటికి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ .. ఏంటే నీ బోడి పెత్తనాలు.. ఇప్పుడు పెళ్లి వాళ్ళింటికి వెళ్లడం అవసరమా అని జానూపై శారద కోప్పడుతుంది. 

ఏంటి జాను పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళావా.. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళావా అని నందు ఎక్సైట్ అవుతుంది. ఏమన్నారే చెప్పు నువ్వు వెళ్తున్నానని చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని నందు అంటుంది. అక్కడ జరిగింది మొత్తం జానూ చెప్తుంది. అక్కడే మురళి కూడా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com