Home

»

Tv News

ఒక్క రోజులో 7 మిలియన్ వ్యూస్.. జిలేబి సాంగ్‌కు నందు మాస్ స్టెప్పులు

Oct 10, 2026 5:55PM

జిమ్ జిమ్ తార జిలేబి తేరా సిన్నోడా  సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఈ సాంగ్ ని ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు లిరిక్స్ యాడ్ చేస్తున్నారు. పాడుతూ రీల్స్ చేస్తున్నారు. కొంతంది సొంతంగా దానికి డాన్స్ కూడా కంపోజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాటకు అదనపు హంగులు అద్దుతూ ఇంకా ఇంకా వైరల్ చేసేస్తున్నారు. చిన్నపిల్లాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ సాంగ్ ప్రతీ ఒక్కరు పడేస్తున్నారు.

రీసెంట్ గా రోల్ రైడ కూడా లిరిక్స్ యాడ్ చేసి పాడి ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. ఇక ఇప్పుడు యాక్టర్, యాంకర్, క్రికెట్ కామెంటేటర్  నందు కూడా ఈ సాంగ్ కి డాన్స్ చేస్తూ రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇంకేముంది ఈ రీల్ పోస్ట్ చేసిన ఒక్క రోజులో 7 మిలియన్ వ్యూస్ ని సొంత చేసుకుని దూసుకుపోతోంది. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.  "కాసు " మూవీ షూటింగ్ గ్యాప్ లో ఇలా ఛిల్ల్ అవుతున్నా అంటూ రీల్ దగ్గర కాప్షన్ పెట్టుకున్నాడు. ఐతే  నెటిజన్స్ కూడా ఈ రీల్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు గీతా మాధురి ఐతే మూడు రెడ్ కలర్ హార్ట్ ఎమోజిస్ పెట్టేసింది. నెటిజన్స్ ఐతే " వదినా అన్న అస్సలు ఆగుతలేదు...నువ్వు సూపర్ మావ  ఇలాంటి పాటలకు ప్రాణం పోసేది నువ్వు ఒక్కడివే మావా.. పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అయ్యా నువ్వు. అన్నయ్యోచ్చాడు.... యాక్టర్ నందు కాదు జిలేబి నందు. " అంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com