Home

»

Tv News

రోహిత్, అమన్ లపై వ్యాలిడ్ నామినేషన్ చేసిన ఝాన్సీ..చప్పట్లతో కంటెస్టెంట్స్ సపోర్ట్!

Oct 7, 2026 10:21AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో సింగర్ ఝాన్సీ నామినేషన్ తో హీటెక్కిపోయింది. ఇప్పటివరకు చాలా సైలెంట్ గా, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న ఝాన్సీ ఈ వారం మాత్రం తనలోని ఫైర్ ని బయటకు తీసింది. మొదటి నామినేషన్ గా ఆమె అగ్నిపరీక్ష టీం కెప్టెన్ రోహిత్ ని టార్గెట్ చేసింది. రోహిత్ ని నామినేట్ చేస్తూ ఝాన్సీ చెప్పిన పాయింట్ అందరినీ షాక్ కి గురి చేసింది. "అగ్ని పరీక్షలో నిన్ను ఇలా చూడలేదు.. ఇక్కడ, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది.. నువ్వు మాటలు తూలుతున్నావ్" అంటూ రోహిత్ ప్రవర్తనలో వచ్చిన మార్పును సూటిగా ప్రశ్నించింది. అగ్నిపరీక్షలో చాలా కామ్ గా, గేమ్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్న రోహిత్, మెయిన్ హౌస్ లోకి వచ్చాక మాట తీరు మొత్తం మారిపోయిందని, అమ్మాయిలతో అసభ్యంగా, అర్థం లేకుండా మాట్లాడుతున్నావ్.. కొన్ని మాటలు అంటున్నావ్.. మర్చిపోయానని చెప్తున్నావ్.. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకొచ్చావని అంటున్నావ్.. అసలు నేనొచ్చిన ప్రతిసారీ నన్ను ఆపాలని చూస్తున్నావని ఝాన్సీ తన నామినేషన్ పాయింట్లుగా చెప్పింది.

ఝాన్సీ వేసిన ఈ స్ట్రాంగ్ పాయింట్ కి రోహిత్ వెంటనే డిఫెన్స్ లోకి వెళ్ళాడు. అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు.. నేను అద్దం లాంటి వాడ్ని అని రోహిత్ సమాధానం చెప్పాడు. అంటే ఎదుటివాళ్లు ఎలా ఉంటే తాను అలానే ఉంటానని, ఎవరైనా తనతో గొడవకు వస్తే తాను కూడా అదే రీతిలో రియాక్ట్ అవుతానని రోహిత్ తనను తాను సమర్థించుకున్నాడు. కానీ ఝాన్సీ మాత్రం రోహిత్ చెప్పిన ఈ అద్దం లాజిక్ ని ఒప్పుకోలేదు. ఒక కెప్టెన్ గా, సీనియర్ కంటెస్టెంట్ గా అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యత ఉందని అద్దంలా కాకుండా అర్థం చేసుకునేలా ఉండాలని ఝాన్సీ మరోసారి కౌంటర్ ఇవ్వడంతో రోహిత్ కి నోట మాట రాలేదు.

ఇక రోహిత్ తర్వాత ఝాన్సీ తన రెండో టార్గెట్ గా అమన్ ని ఎంచుకుంది. అమన్ ని నామినేట్ చేస్తూ ఝాన్సీ వేసిన పంచ్ హౌస్ మొత్తాన్ని సైలెంట్ చేసింది. బచ్చా అని అంటే నీకు ప్రాబ్లం ఉంది.. మరి సుధీర్‌ని పిల్ల బచ్చా అని ఎలా అన్నావ్.. ఆటని ఆటగాడిలా ఆడు.. పోటుగాడిలా కాదు.. చూసుకొని ఆడు.. ట్రిగ్గర్ అయితే నోరు జారుతావా..మాటలు అదుపులో పెట్టుకోమని అమన్‌ని నామినేట్ చేస్తుంది ఝాన్సీ. అమన్ తనను ఎవరైనా బచ్చా అంటే ఫైర్ అవుతాడని, కానీ తానే సుధీర్ ని పిల్ల బచ్చా అంటూ కించపరిచి మాట్లాడాడని ఝాన్సీ పాయింట్ లేవనెత్తింది. ఒకరిని మోటివేట్ చేయడానికి ఇంకొకరిని తొక్కేయడం, చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదని, ఫిజికల్ గా బలంగా ఉంటే సరిపోదు మెంటల్ గా కూడా మెచ్యూర్ గా ఉండాలని చెప్పింది.

దీనికి అమన్ సమాధానం చెప్తూ "నేను సుధీర్ ని అలా అనలేదు, అది ఒక ఫ్లోలో వచ్చింది, నేను పోటుగాడిలా కాదు ఆటగాడిలానే ఆడుతున్నా" అంటూ తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. కానీ ఝాన్సీ మాత్రం "మాటలు ఒకసారి నోటి నుంచి వచ్చాక వెనక్కి తీసుకోలేం, నువ్వు అన్న మాటకు కట్టుబడి ఉండాలి" అంటూ స్ట్రాంగ్ గా చెప్పింది. మొత్తానికి ఝాన్సీ చేసిన ఈ రెండు నామినేషన్స్ ఐదో వారం నామినేషన్స్ లోనే బెస్ట్ నామినేషన్స్ గా నిలిచాయని, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లేడీ సింగర్ ఫైనల్ గా తన వాయిస్ వినిపించిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com